
Nara Chandrababu Naidu | CBN | TDP
June 5, 2025 at 03:29 PM
“సీడ్ రాఖీ” ద్వారా పర్యాపరణ పరిరక్షణకు పాటుపడాలని ఆడబిడ్డలకు పిలుపునిస్తున్నాను. మీ సోదరుల జన్మ నక్షత్రానికి తగిన చెట్టు విత్తనాలతో రూపొందించిన ‘సీడ్ రాఖీ’ని కట్టమని ఆడబిడ్డలను కోరుతున్నాను. మీరు కట్టే సీడ్ రాఖీ తరువాత కాలంలో నేలతల్లిని చేరి మొక్కగా మారుతుంది. ఇది మీ అన్నదమ్ములకు శుభం చేకూర్చడమే కాదు... పర్యావరణానికి హితంగా కూడా ఉంటుంది.
ఈరోజు రాజధాని అమరావతి ప్రాంతమైన అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొని కోటి మొక్కల వన మహోత్సవాన్ని ప్రారంభించాను. వచ్చే పర్యావరణ దినోత్సవం నాటికి రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మొక్కలు నాటి సంరక్షించాలని సంకల్పించాం. దీనికి ‘సీడ్ రాఖీ’ కార్యక్రమంతో మద్దతివ్వాలని మహిళలకు విన్నవిస్తున్నాను.
#environmentday
👍
❤️
🙏
👌
👏
💛
❤
🎉
🫡
60