Nara Chandrababu Naidu | CBN | TDP
Nara Chandrababu Naidu | CBN | TDP
June 10, 2025 at 01:50 AM
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే పేద, మధ్యతరగతికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధులకు ‘‘షైనింగ్ స్టార్స్’’ అవార్డులు ప్రకటించి అందచేసిన ప్రజాప్రతినిధులను, విద్యాశాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్కడో మారుమూల పల్లెల్లో, కష్టాల మధ్య ఉంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని అసమాన ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారంటే ఆ విద్యార్ధుల్ని అభినందించక తప్పదు. ‘‘షైనింగ్ స్టార్స్’’ అవార్డు అందుకున్న విద్యార్ధులు సాటి విద్యార్ధులకు స్ఫూర్తిగా నిలవాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్ధులంతా ‘‘షైనింగ్ స్టార్స్’’ కావాలని ఆకాంక్షిస్తున్నాను. #shiningstars2025 #andhrapradesh
👍 ❤️ 🙏 👌 💐 💛 🫡 🫶 62

Comments