మన మంగళగిరి - మన లోకేష్
May 31, 2025 at 03:17 PM
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే! యూనిఫామ్ దగ్గర నుండి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా? అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.
జి.ఓ 117, ఇతర అసంబద్ధ నిర్ణయాల వలన మీ ఐదేళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని మీరు తీసుకొచ్చారు. నేను మంత్రి అయిన వెంటనే నిర్వహించిన టెస్ట్ లో 90శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పదో తరగతి ఫెయిల్ అయితే చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చదువు ఆపించి పెళ్లి చేస్తారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచించే సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని వాయిదా వేసాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేసిన తరువాతే సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం.
మీరు ఐబి తీసుకొచ్చానని కల కంటున్నట్టు ఉన్నారు. ఐబి అమలు రిపోర్ట్ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసారే తప్ప ఐబి అమలు చెయ్యలేదు. ఇక టోఫెల్ చెప్పే ఉపాధ్యాయులు లేకుండానే అమలు చేసానని జబ్బలు చరుచుకోవడం మీకే చెల్లింది. రూ.4500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, గుడ్ల దగ్గర నుండి చిక్కీల వరకూ రూ.1000 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. మీ హయాంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం నాటి మంత్రి డబ్బులు వసూలు చేసింది బహిరంగ రహస్యం. ఉన్నత విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి మీరు ఆడిన వికృత క్రీడ అందరూ చూసారు.
మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నాం. కేజీ నుండి పీజీ వరకూ పాఠ్య ప్రణాళిక మారుస్తున్నాం. వన్ క్లాస్ వన్ టీచర్ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పుస్తకాల బరువు తగ్గించాం, విలువలతో కూడిన విద్య అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసాం. విద్యార్థులకు అందించే కిట్స్ దగ్గర నుండి అనేక పథకాలకు మహనీయుల పేర్లు పెట్టాం. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందించాం, మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాం. యూనివర్సిటీల పనితీరు మెరుగుపర్చేందుకు ఉత్తమ వ్యక్తులను వైస్ ఛాన్సలర్స్ గా నియమిస్తున్నాం.
పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ. ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగింది. రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ తరువాత మార్కులలో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175. అనగా 99.75 శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే. ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఇందులో 10,159 మంది విద్యార్థుల 11,175 స్క్రిప్టుల (16.8శాతం) వ్యత్యాసాలను గుర్తించి, సరిచేయడం జరిగింది. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నాం. ఈ తేడాలు జగన్ రెడ్డి గారి జమానాలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 8,235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2023లో 61,887 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 10,987 స్క్రిప్టుల (18 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2024లో 55,930 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 9,231 స్క్రిప్టుల (17 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. మీ హయాంలో కనీసం ఈ వివరాలను బయట పెట్టే ధైర్యం కూడా చెయ్యలేదు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు.
ఇక పరీక్షల నిర్వహణ సరిగా లేదని, పేపర్లు లీకయ్యాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్ - 1 లాంటి కీలకమైన ప్రశ్నపత్రాలను హాయ్ ల్యాండ్ లాంటి ప్రైవేటు రిసార్ట్‌లో వాచ్ మెన్లతో దిద్దించింది మీరు కాదా? ధనదాహంతో లక్షలాది మంది యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడింది మీరు కాదా? ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రీ వెరిఫికేషన్లో తేడాలు గుర్తించిన విద్యార్థులకు అర్జేయుకేటీల్లో అడ్మిషన్లకు జూన్ 10వరకు అవకాశం ఇచ్చాం. ఇతర అడ్మిషన్ల విషయంలో కూడా సమయం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
...నారా లోకేష్
విద్య, ఐటి శాఖల మంత్రి
👌
👍
❤️
🙏
9