మన మంగళగిరి - మన లోకేష్
June 5, 2025 at 11:14 AM
*చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు, కార్మికుడికి ప్లాట్ ఫామ్ రిక్షా పంపిణీ* *మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో ఇద్దరికి తోపుడు బళ్లు, ఒక్కరికి ప్లాట్ ఫామ్ రిక్షా అందజేత* *స్థానిక నాయకులతో తోపుడు బళ్లు, ప్లాట్ ఫామ్ రిక్షా అందజేయించిన మంత్రి నారా లోకేష్* *మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు* మంగళగిరి: నియోజకవర్గంలో పేద, బడుగు బలహీన వర్గాల వారికి రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు చేస్తూ అండగా ఉంటున్నారని రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన కట్టెపోగు లక్ష్మయ్య, తాడేపల్లి 3వ వార్డుకు చెందిన ఉయ్యాల కోటేశ్వరికి తోపుడు బళ్లు, నిడమర్రు గ్రామానికి చెందిన తాడిశెట్టి రామస్వామికి ప్లాట్ ఫామ్ రిక్షా అందజేశారు. తమకు బండ్లు అందజేయాలని చిరువ్యాపారులు, రిక్షా కార్మికుడు మంత్రి నారా లోకేష్ ని కోరగా స్పందించిన ఆయన స్థానిక నాయకుల చేతుల మీదుగా బుధవారం తోపుడు బండ్లు, ప్లాట్ ఫామ్ రిక్షా అందజేయించారు. లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తోట పార్థసారథి, వల్లభనేని వెంకట్రావులు మాట్లాడుతూ చాలీ చాలని సంపాదతో అద్దె భారంతో ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులకు సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో మంత్రి నారా లోకేష్ గత ఐదు సంవత్సరాలుగా వారికి అవసరమైన వివిధ రకాల బండ్లు తయారు చేయించి పంపిణీ చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని చిరువ్యాపారులకు మంత్రి నారా లోకేష్ అన్ని రకాలుగా అండగా ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, తాడేపల్లి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ బాషా, 3వ వార్డు అధ్యక్షులు వనమా సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రామారావు, వార్డు ప్రధాన కార్యదర్శి షీమాన్, తాడిబోయిన చలపతిరావు, కడియం శ్రీనివాసరావు, మీసాల నాగేశ్వరరావు, మేకల ఏడుకొండలు, పిన్నిబోయిన నరేంద్ర, తోట గంగాధరరావు, షేక్ నజీర్, పేరుబోయిన వెంకటేశ్వరరావు, బత్తుల నాగరాజు, హరికృష్ణ, ఎస్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
👍 ❤️ 🙏 6

Comments