మన మంగళగిరి - మన లోకేష్
June 8, 2025 at 05:40 AM
*మంగళగిరి నగరంలో ఉచిత ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు శ్రీకారం*
*- మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో ఈ -టాయిలెట్లు*
*- త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ- టాయిలెట్లు*
*మంగళగిరి:*
నవ్య నగరం మంగళగిరిలో దుర్వాసన లేని ఉచిత ఈ - టాయిలెట్ల ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. తన సొంత నిధులతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ -టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ముందు ప్రయోగాత్మకంగా మంగళగిరి నగరంలోని పాత బస్టాండ్ సెంటర్, తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి సమీపంలో రహదారి వెంబడి ఈ -టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ తరువాత కార్పోరేషన్ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ -టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. నగరానికి వివిధ పనుల నిమిత్తం వేలాదిమంది రాకపోకలు సాగిస్తున్నారు. మంగళగిరి చెనేత వస్త్రాలు కొనుగోలు చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలు సైతం ప్రతి రోజూ చేనేత వస్త్ర దుకాణాలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్ కు వెళ్లి కొందరు అవసరాలను తీర్చుకుంటున్నారు. అక్కడి సిబ్బంది ప్రశ్నిస్తారనే భయంతో చాలామంది ఇంటికెళ్లే వరకు ఉగ్గబట్టుకుంటున్నవారు లేకపోలేదు. ఈ నేపధ్యంలో ప్రజల ఇబ్బందులను గమనించిన మంత్రి నారా లోకేష్ కొత్త తరహా ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పై దృష్టి సారించారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఏర్పాటుచేసిన దుర్వాసన లేని ఉచిత ఈ -టాయిలెట్లను తన సొంత నిధులతో నియోజకవర్గంలోని ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయోగాత్మకంగా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్, తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి సమీపంలో రెండు ఈ -టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో నగరంలోని ప్రధాన కూడళ్లలో మరికొన్ని దుర్వాసన లేని ఈ - టాయిలెట్ల ను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం కూడా ఈ -టాయిలెట్లను ఏర్పాటు చేయడంతో పాటు చంటి బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
భవిష్యత్తులో నగరంలోని రహదారుల విస్తరణ జరిగినా ఫ్రీ ఫ్యాబ్ టెక్నాలజీ తో తయారు చేసిన ఈ -టాయిలెట్లను ప్రొక్లెయిన్ సహాయంతో ఎక్కడికైనా సులభంగా తరలించి అవసరమైన కూడళ్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. దుర్వాసన లేని ఉచిత ఈ -టాయిలెట్ల ఏర్పాటుకు చొరవ తీసుకుని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో మంగళగిరి నియోజకవర్గంలో మరెన్నో అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతున్నారు.
#manamangalagirimanalokesh #naralokeshformangalagiri #naralokesh #andhrapradesh
👍
❤️
👌
🙏
13