Warangal District Congress Social media
                                
                            
                            
                    
                                
                                
                                June 11, 2025 at 11:59 AM
                               
                            
                        
                            Warangal 
11-06-2025
* ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
        "మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి" 
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు అన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు వరంగల్ ఓసి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లో ప్రజల నుంచి వినతులను విజ్ఞప్తులను స్వీకరించారు.ప్రజల సమస్యలను సావధానంగా వింటూ అప్పటికప్పుడే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నూతన పథకాలు ప్రవేశ పెడుతూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్న ప్రభుత్వం అన్నారు. బిఆర్ఎస్ నాయకుల తాతాకు చప్పులకు భయపడేది లేదని రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఎన్నికల్లో నిరుపేదలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరుపేదల కన్నీళ్లను తుడిచేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా మోసం చేస్తున్నారని వారి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని కొండా దంపతులు వరంగల్ తూర్పు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు.