SACHIVALAYAM
SACHIVALAYAM
June 10, 2025 at 05:58 AM
```రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా.. పంపిణీని మాత్రం ఆపొద్దని మంత్రి డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా లబ్దిదారుడి ఫొటో తీసుకుని, సంతకం చేయించుకుని రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు. అంతే కానీ రేషన్ ఆపేందుకు మాత్రం వీల్లేదన్నారు. దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోని రేషన్ లబ్దిదారుల డేటాను నిర్వహిస్తున్నారు. వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా రేషన్ పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.```

Comments