
ఆయురారోగ్యాలు 💪 AYURAROGYALU 🩺
June 1, 2025 at 06:44 AM
• *ఇది కమ్మటి దివ్య ఔషధం*
కూర, చారు, పచ్చళ్లకు తాలింపు పెడితే *ఇంగువ* వాసన అదిరిపోతుంది. అది అద్భుత పరిమళాన్ని ఇవ్వడమే కాదు అంతకుమించి ఔషధంగా పనిచేస్తుంది.
ఇది ఎన్ని విధాల మేలు చేస్తుందంటే…!
ఇంగువలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నందున ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది.
జీర్ణప్రక్రియను మెరుగుపరచడం వల్ల
అజీర్తి సమస్య ఉండదు, వేళకు ఆకలి వేస్తుంది.
చర్మం మీద ముడతలు రాకుండా చేసి..
కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది.
జలుబు, ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరడం లాంటి సమస్యలను నివారిస్తుంది.
నొప్పి, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మైగ్రేన్ తలనొప్పికి ఔషధంగా పనిచేస్తుంది.
నెలసరి సమస్యలను తగ్గిస్తుంది.
కీళ్లనొప్పులు తగ్గుతాయి.
మానసిక ఒత్తిడి, ఆందోళనలను నివారించి, మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నరాల బలహీనతను అడ్డుకుంటుంది.
ఇది ఉదర, కాలేయ క్యాన్సర్లను నివారించడంలోనూ తోడ్పడుతుంది.
#asafoetida #inguva #ఇంగువ #health #ఆయురారోగ్యాలు #ayurarogyalu #medicinal #gouthamavenkataramanaraju
