RAJ THAKUR ANNA FANS
RAJ THAKUR ANNA FANS
June 14, 2025 at 08:48 AM
తేదీ 14.06.2025పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజవర్గం గోదావరిఖని *గోదావరిఖనిలో రూ.26 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన రామగుండం ఎమ్మెల్యే శ్రీ ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ గారు* *రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ గారు ఈరోజు గోదావరిఖని పట్టణం చౌరస్తా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రూ.27 కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను సింగరేణి సంస్థ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు* ప్రాజెక్టు పురోగతిని వివరణగా అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత, నిర్మాణ వేగం మరియు పారదర్శకతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ* – “గోదావరిఖని ప్రజలకు ఆధునిక వాణిజ్య సదుపాయాలు కల్పించడమే ఈ షాపింగ్ కాంప్లెక్స్ లక్ష్యం. ఇది ఒక వైపు నగర అభివృద్ధికి దోహదం చేస్తే, మరోవైపు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి,” అని అన్నారు. ఇతర అభివృద్ధి పనులతో పాటు ఈ ప్రాజెక్టు కూడా నగర ముఖచిత్రాన్ని మార్చనున్నదని ఎమ్మెల్యే గారు హర్షం వ్యక్తం చేశారు. "ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం. సింగరేణి మరియు మున్సిపల్ అధికారులతో సమన్వయం కలిగిన విధంగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని ఆదేశించాను," అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యవేక్షన కార్యక్రమంలో సింగరేణి అధికారులు, మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అధికారులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. పనుల ప్రగతిపై అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ప్రజల్లో ఈ ప్రాజెక్టుపై మంచి ఆసక్తి నెలకొంది. ఇది పూర్తయిన తర్వాత గోదావరిఖని ప్రాంతం వ్యాపారాభివృద్ధిలో ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంద వీరి వెంట షాపింగ్ కాంప్లెక్స్ సంబంధిత అధికారులు ఇంజనీర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మజి కార్పొరేటర్లు వివిధ వియుగల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

Comments