
🌾𝐉𝐒𝐏-𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐌𝐄𝐃𝐈𝐀 𝐂𝐎𝐍𝐓𝐄𝐍𝐓✡️🇮🇳🥛✊
June 14, 2025 at 02:58 PM
కూటమి ప్రభుత్వంలో ఇప్పటి నుండి ఒక లెక్క...
* లంచాలు లేకుండా జనతా బజార్ కు పక్కా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తాం!
- ఎమ్మెల్యే వంశీ సమక్షంలో జనసేన లో చేరిన జనతా బజారు సభ్యులు
ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచాలు లేకుండా సమస్యలు పరిష్కారంతోపాటు జనతా బజారు సభ్యులకు పక్కా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో ఏం జరిగిందని కామెంట్ చేయను కానీ కూటమి ప్రభుత్వంలో వ్యాపారులకి ఎవరికీ ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదన్నారు. స్క్రాప్ షాపు వ్యాపారుల సభ్యులు అబ్దుల్ సలాం ఆధ్వర్యంలో
శుక్రవారం సాయంత్రం చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా వ్యాపారాలు చేసుకుంటున్న స్థానికులకు పక్క దుకాణాలు ఇప్పించే బాధ్యత తాము తీసుకుంటామని వెల్లడించారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. తాను దక్షిణ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా మిగిలి ఉంటే ఓటు అడగనని స్పష్టం చేశారు. వ్యాపారాలు ఎవరు దళారు చేతుల్లో మోసపోవద్దని, లంచం లేకుండా సేవలందిస్తామన్నారు. వ్యాపారస్థులకు మంచి అనుకూల వాతావరణం కల్పిస్తామన్నారు. సుమారు 100కుటుంబాలు జన సేనలో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే వంశీ చేతుల మీదుగా అనంతరం ఎన్.డి. ఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 3000 మంది ఆటో డ్రైవర్ లకు కాకి చొక్కాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ ఇన్చార్జి పీ.శివ ప్రసాద్ రెడ్డి,
35 వార్డు జనసేన అధ్యక్షుడు ఎల్. త్రినాధ్, మాజీ కార్పొరేటర్ పిల్లి వెంకటరమణ, వరలక్ష్మి, సయ్యద్ భాష, షకీర్, అమీర్, నౌషాద్ హక్కు, ఎస్ కే హబీబ్, సలీం, రవి, తదితరులు పాల్గొన్నారు.
@JanaSenaParty @PawanKalyan @JSPShatagniTeam
#jansenaparty #pawanakalyan
❤️
👍
🙏
4