Chinthakunta Vijaya Ramana Rao
June 18, 2025 at 09:54 AM
*80 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిబోయే హై లెవల్ వంతెన శంకుస్థాపన...* *నిర్దేశిత గడువు లోగా హై లెవెల్ వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలి...* **అప్రోచ్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు వరకు ఏడు కోట్ల రూపాయలతో నూతనంగా రోడ్డు వేసేందుకు ప్రణాళికలు* *మానేరు నది వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తీయవద్దు* గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు.. ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామంలోని మానేరు వాగుపై హై లెవల్ వంతెన కొరకు 2024 డిసెంబర్ 4 తేదీన పెద్దపల్లి నియోజకవర్గానికి యువ వికాసం నిరుద్యోగ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ. రేవంత్ రెడ్డి గారు రూ. 80 కోట్ల రూపాయల నిధులతో జీవో విడుదల చేసిన నేపథ్యంలో తన పట్టుదలతో టెండర్ పూర్తి చేసుకున్న హై లెవల్ వంతెన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారితో మరియు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు గారు మాట్లాడుతూ.... ఓదెల మండల ప్రజల చిరకాల ఆకాంక్ష రూపు నారాయణపేట వద్ద మానేరు నది పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రజా ప్రభుత్వం ప్రారంభించనుందని అన్నారు. 40 గ్రామాల ప్రజలకు ఈ వంతెన చాలా ఉపయోగ పడుతుందని, వరంగల్ వెళ్లేందుకు 20 కిలో మీటర్ల దూరం తగ్గిపోతుందని, అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిగణించాలని అన్నారు. ప్రజలకు లాభం జరుగుతుందో ఆలోచించి కలెక్టర్ అద్బుతం గా పని చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఓదెల ప్రాంతం చివరి ఆయకట్టు ప్రాంతమని, సాగు నీరు అందదని అన్నారు. ఇసుక రీచ్ లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తీసెందుకు అనుమతించవద్దని అన్నారు. రూపు నారాయణపేట రీచ్ తప్ప గతంలో మిగిలిన అన్ని రీచ్ లలో ఇసుక తీశారని, ఇసుక తీసిన చోట పొలాలు ఎండి పోయాయని మా దగ్గర ఎండి పోలేదని అన్నారు. ప్రజలలో చైతన్యం రావాలని, మన ప్రాంతం సాగునీరు త్రాగు నీటికి ఇబ్బందే లేకుండా ఉండాలంటే ఇసుక తీసుకుని వెళ్ళవద్దని అన్నారు. సన్న వడ్లకు వానాకాలంలో 1100 కోట్ల బోనస్ వేస్తే ఒక పెద్దపల్లి నియోజకవర్గానికి మాత్రమే 60 కోట్ల బోనస్ ప్రభుత్వం చెల్లించిందని, యాసంగి లో మరో 31 కోట్ల రూపాయలు త్వరలో జమ అవుతాయని అన్నారు. గతంలో దసరా వరకు వడ్ల పైసలు జమ కాకపోయేవని, నేడు 48 గంటల్లో రైతులకు ఖాతాలో పంట డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోలు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరక్టర్లు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Comments