
CM Ramesh
June 12, 2025 at 02:55 AM
అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఏపీఐఐసీ వన్ స్టాప్ సెంటర్ వద్ద యోగాంధ్ర-2025 కార్యక్రమంలో హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, మాడుగుల ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు, యలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గార్లతో కలసి పాల్గొన్నాను.
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం మన ఆరోగ్యానికి, మానసిక శాంతికి యోగాసనాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. యోగా అనేది ప్రాచీన భారతీయ సంపదగా, మన శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యతను తీసుకొచ్చే మార్గం. కార్మికులు ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతగానో దోహదపడుతుంది.
ఈ నెల 21న విశాఖపట్నంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పాల్గొననున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అందరూ కలసి విజయవంతం చేయండి.
#internationalyogaday | #cmramesh
🙏
👍
❤️
👏
💛
12