
Yours Media
June 18, 2025 at 05:04 PM
Press Release
*డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానం*
*అమరావతి,జూన్ 18 :*
రాష్ట్రంలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్ల అడ్మిషన్ల కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. రేపటి నుంచి ఆయా పాఠశాలల్లో ఈ ధరఖాస్తులు స్వీకరిస్తారు. ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ (25 జూన్ 2025 )పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎస్సి, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
*రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలు*
6 వ తరగతి - 3,095
7 వ తరగతి - 1255
8 వ తరగతి - 882
9 వ తరగతి - 875
*జారీ చేసినవారు*
(AP.SWREIS) ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ప్రధాన కార్యాలయం, తాడేపల్లి, అమరావతి )