
తిరుమల సమాచారం LaxmiTeluguTech
June 19, 2025 at 02:50 PM
👆 *ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు*
తిరుపతి, 2025, జూన్ 19: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు గురువారం ముగిశాయి. జూన్ 17 నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి.
ఇందులోభాగంగా ఉదయం 5.30 – 6.30 గం.ల వరకు శ్రీ సుందరాజస్వామి వారి మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గం.ల మధ్య శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 5.45 – 6.15 గం.ల వరకు శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 7.00 – 8.30 గం.ల వరకు నాలుగు మాడ వీధులలో శ్రీ సుందరరాజ స్వామి వారు గరుడ వాహనంపై విహరించి భక్తులకు అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆర్జితం ఇన్పెక్టర్ శ్రీ చలపతి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
🙏
❤️
6