
Warangal District Congress Social media
June 19, 2025 at 01:54 PM
Warangal
19-06-2026
* రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
* వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పోచం మైదాన్ జంక్షన్ లో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవనీయులు శ్రీ కొండా మురళీధర్ రావు (మాజీ ఎమ్మెల్సీ) గారు హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుని తెలంగాణలో కులగనణ ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారని కొండా మురళి తెలిపారు.
దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఈ సందర్భంగా తెలిపారు.