M.S RAJU | TDP
June 16, 2025 at 02:15 PM
*ప్రెస్ రిలీజ్...16-06-2025.*
*మడకశిర అభివృద్ధే ధ్యేయంగా కలిసి కట్టుగా పనిచేయాలి*
*- నియోజకవర్గ ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే రాజు సూచన..*
*- క్యాంపు కార్యాలయంలో నాయకులతో సమీక్షా సమావేశం*
*మడకశిర :*
మడకశిర నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని పార్టీ నాయకులకు మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు సూచించారు. మడకశిరలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
మడకశిర నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఎలాంటి అంతర్గ విబేధాలున్నా వాటిని తక్షణమే నా దృష్టికి తీసుకురావాలి. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రతి నాయకుడు, కార్యకర్త దృష్టి సారించాలి. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అవ్వాలి. ప్రజలకు అవసరమైన ఏ పని ఉన్నా దానిని తక్షణమే నా దృష్టికి తీసుకొస్తే, చర్చించి దానిని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సేవలందించడానికి ఉపకరిస్తుంది. కూటమి పాలనలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయాలి. పార్టీలో కష్టపడేవారికి పార్టీ తగిన గుర్తింపునిస్తోంది. పార్టీ అధిష్టానం మడకశిర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని ఎం.ఎస్.రాజు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తన క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పార్టీ నాయకుల సమీక్షా సమావేశంలో ఆగళి, అమరాపురం, గుడిబండ, రోళ్ల, మడకశిర మండలం, మడకశిర నగరపంచాయతీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.
*(మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు వారి కార్యాలయం నుండి జారీ...)*
❤️
1