M.S RAJU | TDP
June 17, 2025 at 05:31 PM
సీఎం సహాయనిధి పేదల పెన్నిధి.. అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్
మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు
మడకశిర
ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి కార్పొరేట్ వైద్యంతో స్వస్థత పొందేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు తెలిపారు. పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి చేతుల మీదుగా మడకశిర నియోజకవర్గంలోని 32 మంది లబ్ధిదారులకు రూ.13.46లక్షలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు రూ.2కోట్లకు పైగా నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగిందన్నారు. అనంతరం చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
#idhimanchiprabhutvam #madakasiramla #ttdboardmember #mlamsraju
❤️
1