APPSC/ UPSC
June 17, 2025 at 02:38 PM
*Information about SSD TOKENS FOR FREE DARSHAN IN TIRUMALA:* *3 స్థలాల క్రింద తెలిపిన కౌంటర్లలో ప్రతిరోజు సాయంత్రం 04.00 గంటలకు ఇవ్వాలి. కానీ రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం 02.00 గంటల నుండే tokens ఇవ్వడము మొదలు పెడుతున్నారు. భక్తులు మధ్యానం కల్ల అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి* విష్ణు నివాసం         (రైల్వే స్టేషన్ ముందు వైపు)  శ్రీనివాసం        (బస్టాండ్ ఎదురుగా) భూదేవి కాంప్లెక్స్                     (అలిపిరి బస్టాండ్ దగ్గర)      టోకెన్లు తీసుకుని మీరు వాహనాల్లో గాని బస్సు లో గాని అలిపిరి మెట్ల మార్గం ద్వారా గాని తిరుమల వెళ్ళివచ్చు. *శ్రీవారి మెట్టు:* *శ్రీవారి మెట్టు (కాలినడక మార్గం) టోకెన్లు – తాజా మార్పులు:* ➡️ ఇకపై శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు ఇవ్వరు. ➡️ టోకెన్లు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే జారీ అవుతాయి. ➡️ ఈ మార్పు జూన్ 6వ తేదీ (శుక్రవారం) నుండి అమల్లోకి వస్తుంది. ➡️ టోకెన్లు "ముందు వచ్చిన వారికి ముందు" పద్ధతిలో ఇవ్వబడతాయి. ➡️ టోకెన్ తీసుకున్న భక్తులు తమ ఆధార్ చూపించాలి. ➡️ టోకెన్ స్కాన్ చేయాల్సిన ప్రదేశం: 1200వ మెట్టు వద్ద ➡️ టోకెన్లు పొందినవారు మాత్రమే మెట్ల మార్గం ద్వారా తిరుమలకి వెళ్లాలి. శ్రీవారి మెట్టు మార్గం (శ్రీనివాస మంగాపురం దగ్గర, తిరుపతి బస్టాండ్ నుండి 20 కి.మీ.దూరం ఉంటుంది). టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 12 గంటలు పట్టవచ్చు. డైరెక్ట్ గా తిరుమలలో కంపార్ట్మెంట్ లోకి వెళ్లి కూర్చోవటమే. అలిపిరి మెట్ల మీద టోకెన్ల స్కానింగ్ లేనందున మీరు మెట్లు లేదా వాహనం ద్వారా వెళ్ళవచ్చు మీరు టోకెన్‌లను తీసుకొని, స్థలం నుండి నిష్క్రమించే వరకు క్రమం తప్పకుండా సమూహంలో టోకెన్ల లభ్యతను భాగస్వామ్యం చేస్తూ ఉండండి. *TTD PRO DEPT*

Comments