APPSC/ UPSC
June 17, 2025 at 02:39 PM
*తిరుమల పర్యటన-భక్తుల సందేహములు-సమాధానములు:* 1) మాకు టికెట్లు లేవు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ?. జ) మీరు టిక్కెట్లు ఆన్లైన్లో బుక్  చేసుకోకపోతే ఈ క్రింది ఇచ్చిన ప్రదేశాల్లో మీకు SSD టోకెన్లు దొరుకుతాయి. విష్ణు నివాసం , శ్రీనివాస0 , భూదేవి కాంప్లెక్స్ లలో ముందు రోజు సాయంత్రం 4:00 లేదా రాత్రి 9:00 నుండి కౌంటర్లు ప్రారంభమవుతాయి. 2) SSD టోకెన్లు అంటే ఏమిటి ? జ) Time Slotted Sarva Darshan మీకు ఇచ్చిన టైం ప్రకారం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. 3) SSD టోకెన్లు లేకపోతే దర్శనానికి మా పరిస్థితి ఏంటి ? జ) మీరు నేరుగా సర్వదర్శనంలో స్వామివారిని దర్శించే చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ పడుతుంది. సాధారణ రోజుల్లో 8 నుంచి 10 రద్దీ ఉన్న రోజుల్లో 16 నుండి 24 వరకు పట్టే అవకాశం ఉంటుంది. 4) మెట్ల మార్గంలో దర్శనం టోకెన్లు ఇస్తారా ? జ) అలిపిరి మెట్లు మార్గంలో అయితే ఇవ్వరు. భూదేవి కాంప్లెక్స్ లు టోకెన్ తీసుకోవాలి. శ్రీవారి మెట్టు ద్వారా నడిచి వెళ్లే భక్తులు మార్గమధ్యంలో టోకెన్లు భూదేవి కాంప్లెక్ లో ఇవ్వడం జరుగుతుంది. 5) చిన్నపిల్లల దర్శనం ఎప్పుడు కనిపిస్తారు జ) ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.. సుఫదం ద్వారా వెళ్ళవచ్చు.విశేష పర్వదినాల్లో దర్శనాలు రద్దు చేస్తారు. 6) చిన్నపిల్లల దర్శన్లు ఎవరెవరు వెళ్లవచ్చు ? జ) చిన్నపిల్లలు ఒక సంవత్సరం లోపు  వయసు కలిగి ఉండాలి . చిన్నపిల్లల యొక్క ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లాడి యొక్క తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతి 7) ముందుగా రూమ్ బుక్ చేసుకోలేదు.. కొండపైన రూమ్ దొరుకుతుందా ? రూమ్ దొరక్కపోతే పరిస్థితి ఏంటి ? జ) ఖచ్చితంగా దొరుకుతుంది.CRO ఆఫీస్ వద్ద క్యూలైన్లోకి వెళితే  గదులు ఖాళీలు బట్టి మీకు కేటాయించడం జరుగుతుంది. లేనిపక్షంలో యాత్రికసదన్ లో లాకర్స్ తీసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. 8) వయోవృద్ధులకు, దివ్యాంగులకు కొండపైన దర్శనం ఉంటుందా ? జ) ఉండదు . ముందుగా ఆన్లైన్లో  బుక్ చేసుకోవాలి. 9) 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కొండపై దొరుకుతాయా ? జ) దొరకవు. 10) బ్రేక్ దర్శనం లెటర్ పై ఎంత మంది దర్శనానికి వెళ్ళవచ్చు ? జ) ఆరుగురు వెళ్లవచ్చు. 11) శ్రీవారి వాలంటరీ సేవా చేయాలంటే ముందుగా ఏం చేయాలి ? జ) 15 మంది గ్రూపుగా ఏర్పడి ... ఆన్లైన్లో అప్లై చేసుకుంటే శ్రీవారి సేవకు అర్హులు అవుతారు. 12) దర్శనం కోసం మీ సలహా ఏంటి ? జ) ముందుగా ఆన్లైన్లో టికెట్లు , రూములు బుక్ చేసుకుని కొండపైకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అవుతుంది. 13) మా పిల్లలకు ఎన్ని సంవత్సరాలు దాటితే టిక్కెట్ తీయాలి ? జ) 12 సంవత్సరాలు లోపు వారికి ఎటువంటి టిక్కెట్టు అవసరం లేదు... 12 సంవత్సరాల దాటితే కచ్చితంగా టికెట్ తీయాలి. *గమనిక* : దర్శనం టికెట్లు , రూముల కోసం ఎవరన్నీ సంప్రదించి డబ్బులు పోగొట్టుకోకండి. *TTD PRO DEPT*

Comments