
Kakarla Suresh | TDP
June 19, 2025 at 11:03 AM
దుత్తలూరు మండలం పవిత్ర నర్రవాడ గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన బండ్లు–పొంగళ్ళ ప్రధానోత్సవంలో నేను, ఉదయగిరి శాసనసభ్యుడిగా, మరియు సర్వేపల్లి శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ మంత్రి గౌ. శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాం.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించాం. అనంతరం ధ్యాన వెంగమాంబ మందిరాన్ని దర్శించుకొని అమ్మవారి తపోమూర్తి జీవితం గురించి సమాచారం పొందాం. ఆలయ చైర్మన్ తుమ్మల సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో శాలువా, పూలమాలలతో ఆత్మీయంగా సన్మానించారని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం లో పాల్గొనడం ఓ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
#kakarlasuresh #vengamambabrahmotsavam #udayagirimla #somireddychandramohanreddy
