
KARIMNAGAR JOBS
May 26, 2025 at 03:39 PM
*తెలుగు విశ్వవిద్యాలయం కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు.. లేట్ ఫీజుతో జూన్ 30 వరకు ఛాన్స్*
2025 విద్యా సంవత్సరానికి సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Suravaram Pratap Reddy Telugu University) నిర్వహించే రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం (Telugu University) విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ (Registrar) ఒక ప్రకటన విడుదల చేశారు. శిల్పం-చిత్రలేఖనం, డిజైన్స్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ నృత్యం (కూచిపూడి, ఆంధ్రనాట్యం), జానపదం, తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా లాంటి తదితర అంశాలలో తెలుగు విశ్వవిద్యాలయం పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తోంది.
కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగి ఆసక్తిగల విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం www.teluguuniversity.ac.in & www.pstucet.org వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించారు. దరఖాస్తులను జూన్ 26 వ తేదీలోగా, ఆలస్య రుసుము (లేట్ ఫీజు)తో జూన్ 30 లోగా విశ్వవిద్యాలయానికి సమర్పించాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో సూచించారు.