Harish Rao Thanneeru
June 15, 2025 at 07:40 AM
సుమన్ టీవీ డాక్టర్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
డాక్టర్స్ కి ఇంత మంచి అవార్డులను అందిస్తున్న సుమన్ టీవీ యాజమాన్యానికి, వారి టీంకి నా అభినందనలు.
చాలా వృత్తులు చాలా బిజినెస్లు ఉంటాయి. కానీ డాక్టర్కు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
వైద్యో నారాయణో హరి అని అంటారు
తల్లి జన్మనిస్తే ఒక ఆపదలో ఉన్న పేషెంట్ కు పునర్జన్మని ఇచ్చేది డాక్టర్.
ప్రభుత్వంలో ఉన్న డాక్టర్లకు మరింత బాధ్యతగా సేవలు చేసే విధంగా, కొత్తవారిని సేవలు చేసే విధంగా ఈ అవార్డులు దోహదం చేస్తాయి.
కరోనా సమయంలో డాక్టర్ల గొప్పదనం బయటపడింది. ప్రాణాలను లెక్కచేయకుండా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు.
కుటుంబాన్ని, కట్టుకున్న భార్యని, పిల్లలను చూడ్డానికి కూడా భయపడ్డ రోజుల్లో తమ ప్రాణాలను లెక్కచేయకుండా రాష్ట్రంలో అద్భుతమైన సేవలు అందించారు డాక్టర్లు.
దేశ నలుమూలల నుండి వైద్యానికి చాలామంది పేషెంట్లు హైదరాబాద్ వస్తున్నారు.
ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులు సైతం హైదరాబాద్ కొచ్చి వైద్యం పొందుతున్నారు.
హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ గా రూపొందడం చాలా సంతోషకరం.
ఇతర దేశాల నుండి హైదరాబాద్కు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడ ఉండే ఇన్ ఫ్రా కావచ్చు డాక్టర్లు కావచ్చు. అన్ని విధాల హైదరాబాద్ మెడికల్ హబ్ గా మారింది.
కేసీఆర్ గారి కృషితో
భారత దేశంలో డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
కేసీఆర్ గారి ప్రభుత్వం ముందు చూపుతో ఐదు మెడికల్ కాలేజీలను 35 మెడికల్ కాలేజీలకు పెంచుకున్నాం.
తెలంగాణ నుండి ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు.
రాష్ట్ర అవసరాలే కాదు దేశానికి అవసరమయ్యే డాక్టర్లను అందించే విధంగా తయారుచేసింది.
హైదరాబాదు నాలుగు మూలల్లో నాలుగు టిమ్స్ హాస్పిటళ్లను, వరంగల్లో హెల్త్ సిటీ పనులను కూడా ప్రారంభించాము.
పేషెంట్లు వస్తే డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామనే వారే కాకుండా ఉచితంగా ప్రాణాలు కాపాడేవారు కూడా ఉంటారు.
ములుగు, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు గొప్ప వాళ్లు.
మారుమూల ప్రాంతంలోకి పోయి డాక్టర్లు సర్వీస్ చేయాలంటే వారి పిల్లలకు, వారి కుటుంబానికి అక్కడి వసతులు, చదువు వంటి సౌకర్యాలు లేకపోయినా వారు ముందుకెళ్ళి పని చేస్తుంటారు.
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించి, ప్రతీ కాలేజీలో పీజీతో పాటు నర్సింగ్, ఫార్మసీ కాలేజ్ కూడా అనుసంధానం చేశాం.
డాక్టర్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎంతో ముఖ్యం. ముందు చూపుతో వాటిని కూడా మేము ప్రణాళిక బద్ధంగా ప్రారంభించాం.
బార్డరులో పనిచేసే సైనికుడికైనా, దేశానికి అన్నం పెట్టే రైతుకైనా, ప్రాణాలను కాపాడే వైద్యులకైనా సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్.
భవిష్యత్తులో వైద్యరంగంలో మన రాష్ట్రం ప్రముఖమైన పాత్ర పోషించాలని, ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు.
❤️
👍
🙏
16