News Info & Job Alerts
News Info & Job Alerts
June 20, 2025 at 01:00 PM
*కమిషనర్ గారు మాట్లాడుతూ ఉదయం 9.30 లోపల హాజరు వేయక పోతె ఆబ్సెంట్ గా పరిగణిస్తారు.సెలవు కావలసిన వారు ఉదయం 7 కి అప్లై చేసుకోవలెను.DEO లు dyeo లు ఏ పాఠశాలకు వెళ్ళాలి అనేది వారికి cse నుండి మేసేజ్ వస్తుంది.* *ఈరోజు గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CSE) వారి సమావేశపు ముఖ్యంశాలు* *★ ప్రతిరోజూ స్టూడెంట్ అటెండన్స్, టీచర్ అటెండన్స్ తప్పనిసరిగా ఉదయం 9 లోపు నమోదు చెయ్యాలి.* *★ రేపటి నుండి MEO అనుమతి లేకుండా ఎవ్వరు కూడా DDO రిక్వెస్ట్, డెప్యూటేషన్ మరేదైనా అప్లై చెయ్యడానికి లేదు.* *★ ప్రతిరోజూ గౌరవ కమీషనర్ గారు 9.30 కి అటెండన్స్ పై రివ్యూ చేయనున్నారు.* *★ రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది నుండి మండల విద్యాశాఖ సిబ్బంది వరకు హాజరు నమోదు పై రివ్యూ ఉంటుంది.* *★ నా పర్యవేక్షణ సమయంలో లేదా నా సిబ్బంది పర్యవేక్షణ సమయంలో ఏ పాఠశాలలో అయిన స్కూల్ లొకేషన్ లో సిగ్నల్ ఉండి ఆ ప్రదేశంలో ఉపాధ్యాయులు హాజరు వెయ్యానిచో వారిపై చర్యలు తీసుకోబడును అని కమిషనర్ గారు ఆదేశించియున్నారు.* *★ ఏ పాఠశాలలో అయిన సిగ్నల్ సమస్య ఉంటే MEO గారు నాకు లెటర్ రూపంలో తెలియజేసినట్లయితే మేము CSE వారితో సంప్రదించి లొకేషన్ అన్ ఫ్రీజ్ చేస్తారు, తదుపరి లొకేషన్ కాప్చర్ చేయుటకు అవకాశం ఉంటుంది.* *★ ప్రతి పాఠశాలలో టైం టేబుల్ వారీగా ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మరియు పీరియడ్ వారీగా తరగతులు నిర్వహించాలి.* *★ నేను, మా పర్యవేక్షణ సిబ్బంది అతి త్వరలో ప్రతి జిల్లా ప్రతి మండలం మండలంలో పాఠశాలలు పర్యవేక్షించునున్నాము అని కమీషనర్ గారు తెలియజేసియున్నారు.* *★ కనుక నేను పాఠశాలకు వచ్చేటప్పుడు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న టైం టేబుల్ వారీగా తరగతులు మరియు పీరియడ్స్ వారీగా పర్యవేక్షించడం జరుగుతుంది.* *పై సూచనలు గౌరవ కమిషనర్ గారు ఆదేశించియున్నారు*

Comments