
Vegesana Narendra Varma | Bapatla | TDP
June 21, 2025 at 03:03 PM
బాపట్ల నియోజకవర్గం బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి గారు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య గార్లతో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కేర్ యోగా నాచురోపతి మెడికల్ కాలేజీ విద్యార్థిని,విద్యార్థులు నిర్వహించిన యోగా ప్రదర్శనలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ :-
యోగాంధ్రవలన ఆరోగ్యం, ఆనందం ప్రతి మనిషికి దక్కాలని ఆయన అన్నారు. యోగాంధ్ర ను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. యోగాంధ్ర ద్వారా యోగాను నేర్పించడం, ప్రతిరోజు చేయించడం, యోగాను రోజు చేయటం వలన మంచి ఆరోగ్యంతో మన దైనందిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటామని, తెలివిగా ఆలోచిస్తామని ఆయన అన్నారు. అదే హుషారుతో భారత దేశమంతా మన పనితనం వలన భారతావని ప్రపంచ దేశాల్లో జేరి ఈరోజు 4 స్థానంలో ఉందన్నారు. రాబోవు రోజుల్లో 2047న వికసిత్ భారత్ వైపు వెళ్తున్నామని అన్నారు. అంతకంటే ముందే మొదటి లేక రెండవ స్థానంలో ఉంటాం అనే సందేహం లేదన్నారు. అందరం ఏ పని చేసినా ఇష్టపడి, క్రమశిక్షణతో, సమయానికి పూర్తిచేసే విధంగా పనిచేయాలన్నారు. యోగాను ప్రతిరోజు అలవర్చుకోవాలి, దానివల్ల ఆరోగ్యం, ఆనందమే కాకుండా కుటుంబానికి తద్వారా దేశానికి మేలు చేసే ఆలోచన ఉంటుందన్నారు. మనందరం బాగుండాలి కలిసి ఉండాలి అని అన్నారు. ఎన్నో మతాలు, కులాలు, దైవాలు,దైవత్వాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు కలిసి ఉన్న భారతమాత ముద్దుబిడ్డలం అని అన్నారు. భారతదేశంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలని అన్నారు. రాష్ట్రంలో మనలను మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాలు జరుపుకుంటున్నామని అన్నారు. జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ వారి సూచన మేరకు పనిచేస్తూ 22వ స్థానంలో ఉన్న జిల్లాను 5వ స్థానానికి తీసుకువచ్చే విధంగా కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒకటి లేక రెండవ స్థానాల్లో, రాష్ట్రాన్ని మొదటి స్థానంలో, బాపట్ల జిల్లాను ఒకటి లేక రెండవ స్థానంలోకి తీసుకురావడానికి మనందరి కృషి చేయాలని ఆయన అన్నారు.
యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు ఇంత ఘనంగా నిర్వహించడానికి కారుకులైన అధికారులను, యోగా గురువులను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి గారు, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు, చీరాల శాసనసభ్యులు ఎం.మాలకొండయ్య గారు శాలువా మరియు మెమొంటో లతో సత్కరించారు. యోగా కార్యక్రమం అనంతరం బాపట్ల నగరవణంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి గారు, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ గారు,ఆర్.డీ.ఓ. గ్లోరియా, తాసిల్దార్ సలీమా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, డి ఆర్ డి ఎ పి డి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి.గ్లోరియా, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.