
Hindu Temples Guide
June 20, 2025 at 02:25 AM
తిరుమల మొదటి గడప దర్శనం అంటే ఏమిటో తెలియదు.. మా ఆఫీసు లో రాజా చంద్ర నువ్వు బాగా దగ్గరకు వెళ్ళి చూసావా ఎప్పుడైనా అన్నారు.. లేదండి.. అలా దగ్గరకు కూడా వెళ్ళవచ్చా అని అడిగాను..
చెన్నై లో జాబ్ అవ్వడం తో ఒకసారి శ్రీవారి మెట్టు మరో సారి అలిపిరి మెట్టు మరో సారి శ్రీవారి మెట్టు అలా వెళ్తూ ఉండేవాణ్ణి..
ఇంకా చెప్పాలంటే కంచి వెళ్లి అమ్మవారితో తిరుమల వెళ్తున్నాను దర్శనం బాగా చేయించమ్మ అని అడిగేవాణ్ణి తిరుమల వెళ్లి వచ్చి మరల కంచి వెళ్ళేవాణ్ణి బాగా దర్శనం అయిందమ్మ అని చెప్పేవాణ్ణి ఇదే నా పని.
అంగప్రదక్షిణ చేసేవారికి ఒక్కోసారి మొదటి గడప దర్శనం ఇస్తారని ఒకరు చెప్పారు నాకు.. ఇక అప్పటినుంచి స్వామి వారి మెట్లు ఎక్కి వెళ్లడం అంగ ప్రదక్షిణ టికెట్ తీసుకోవడం ముందుగా నడిచివెళ్ళిన దర్శనం చేసుకోవడం అక్కడే ఉండి కోనేట్లో స్నానం చేసి అంగప్రదక్షిణ చేసుకోవడం ఇలా రెండు దర్శనాలు చేసుకోవడం అలవాటైపోయింది. ఎన్నిసార్లు అంగప్రదక్షిణ చేసిన మొదటి గడప ఇవ్వలేదు.. 10 సార్లకు పైగా చేసిన తరువాత స్వామి ఏమిటి స్వామి నాకు అవకాశం రాదా నాకు దర్శనం ఇవ్వవా అనుకుంటూ లైన్ లో కదులుతూ... నా ముందువాళ్ళు ఎవరైనా లోపలకి వెళ్తున్నారేమోనని చూస్తున్న అందరూ జయవిజయల దగ్గర నుంచే వెళ్తున్నారు ఈ సారి కూడా లేదన్నమాట అనుకున్న ..
జయవిజయుల దగ్గరకు చేరుకుని నమస్కరిస్తున్న శనివారం కావడంతో స్వామి వారు అలంకరణలో అద్భుతంగా కనిపిస్తున్నారు.. పదండి పదండి అని తీస్తున్నారు, నాలో కోరిక నీకు వినిపించిందా స్వామి అని కళ్ళతోనే అడుగుతూ గోవింద గోవిందా అంటునాను.. ఒక్కసారిగా *స్వామి వారి కుడి చెయ్యి చాలా పెద్దదిగా కనిపించింది*.. 3D లో చూస్తే ఎలా ఉంటుంది అలా.. ఆశ్చర్యం వేసింది నిజామా కాద భ్రమ అనుకున్నాను.. మా సార్ తో చెప్పాను.. *స్వామి నిన్ను కరుణించారు పండగ చేసుకో అన్నారు*.
ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాను.. ఎవరు ముందుగా బుక్ చేస్తే వారికే టికెట్ ఇప్పుడు 300/- టికెట్ ల.. సేవల మీద అవగాహన లేదు .. తెలిసింది సుప్రభాతం ఒకటే వెంటనే బుక్ చేశాను.. నా కోరిక తీరింది మొదటి గడప దర్శనం చేసుకున్నాను.
ఆ తరువాత నెల మా అమ్మకు నాన్నకు చిన్నాన్న చిన్నమ్మకు బుక్ చేస్తుంటే కంగారు లో చిన్నానకు చేయడం మర్చిపోయాడు మా ఫ్రెండ్ .. పర్వాలేదు చిన్నాన్న మనం అంగ ప్రదక్షిణ చేద్దాం అని తీసుకుని వెళ్ళాను.. కొండపైన లక్కి డ్రా వేయించాను స్వామి వారు కరుణించారు చిన్నాన కు కూడా సుప్రభాతం తగిలింది. అందరూ సుప్రభాతం చేసుకున్నారు.. ఆనందాలకు అవధులు లేవు.
అందరం వెళ్ళాం కానీ పాపం నాన్నమ్మ చూడలేదు.. బుక్ చేద్దాం అంటే లక్కి డ్రా పెట్టేసారు ఎలా అనుకున్న.. రెండు మూడు సార్లు వేసాను .. నాకు నాన్నమ్మ కు సుప్రభాతం తగిలింది..
మరో సారి మరికొన్ని రాస్తాను.. హిందూ టెంపుల్స్ గైడ్ తిరుమల తిరుమల అని అనడానికి కారణం ఏమిటో మీకు తెలిసిందా?
🙏
👍
🖕
😮
22