🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
February 8, 2025 at 06:39 AM
🔔 *సత్సంగం* 🔔 ధర్మ బద్ధం గా జీవిద్దాం! ధరాన్ దారయతీతి ధర్మః- అన్నది ఆర్యో క్తి. ధర్మం ఈ భూమిని ఆశ్రయించి ఉందనేది అర్థం . భూమికి సూర్యు డి చుట్టూ తిరగటం, జలానికి ప్రవహించడం , వాయువుకు వీచే గుణం , అగ్నికి మండే స్వభావం .. వాటివాటి ధర్మా లు. ధర్మంలో సామాన్య ధర్మం , విశేష ధర్మం అని రెం డు రకాలున్నాయి. సామాన్య ధర్మం : మనకు తెలిసినదాన్ని ఇతరులకు బోధిం చడం గురుధర్మం . భయభక్తులతో అభ్య సించటం శిష్య ధర్మం . న్యాయం గా సంపాదించి సంసారాన్ని పోషిం చటం యజమాని ధర్మం . వృద్ధాప్యం లో తల్లిదం డ్రులను ఆదరించటం పుత్రధర్మం . పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం సత్య ధర్మం . జీవనపర్యంతం భార్యను సంరక్షిం చటం వివాహధర్మం . భర్తను వెన్నంటి ఉండటం భార్య ధర్మం. స్నేహితులను ఆదరించటం మిత్రధర్మం . అసహాయులను కాపాడటం మానవధర్మం . అందరితో అన్ని వేళలా ధర్మబద్ధం గా సాగటమే మనందరి ధర్మం . విశేష ధర్మం : చెడు కోరికలు లేకపోవటం , చౌర్యం చేయకపోవటం , క్రోధం లేకపోవటం , శరీరాన్ని , మనసును స్వచ్ఛం గా ఉంచుకోవటం , దయతో మెలగటం , తల్లిదం డ్రులు, గురువులకు సేవచేయటం , ఇతరులను బాధపెట్టకపోవటం , ఇంద్రియ నిగ్రహం , వివేకం , సత్యం , ధైర్యం , క్షమ, విద్య- వీటిని విశేషధర్మం గా పరిగణిస్తారు. ఈ సత్కర్మలను ఆచరించడం అంటే.. అది భగవం తుని ఆరాధిం చటమే. కనుక ధర్మ బద్ధం గా జీవిద్దాం. *శ్రీరాముడు, సత్య హరిశ్చం ద్రుడు తదితర పుణ్యాత్ములను అనుసరించి తరిద్దాం* ధర్మో రక్షతి రక్షితః 🙏🏻 https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏 ❤️ 👍 43

Comments