HT Telugu
February 10, 2025 at 02:46 AM
> స్టాక్స్ బై టుడే లిస్ట్..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 470.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 454.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 10179.4 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,274.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.