Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
January 18, 2025 at 02:10 AM
నేను ఒక రోజుమా బంధువుల ఇంటికి వెళ్ళాను. మా నానమ్మ వరుస ఆవిడ ఇంటి ముందు నేను చెప్పులు విప్పినది చూసింది. వాటిలో ఒకటి బోర్లా పడింది వెంటనే అరుస్తూ నన్ను తిడుతూ మా ఇంటి ముందు చెప్పు బోర్లా పడితే మా కుటుంబమంతా అప్పుల పాలు అవుతుంది. మా బతుకంతా తలకిందులు అవుతుంది అని అన్నది. చెప్పులు బోర్లాపడకూడదు ఎప్పుడు తల క్రిందులుగా పడకూడదు అన్నది. అలా పడితే కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని చెప్పింది. కాని అలా ఎవరు చెప్పారు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు. చెప్పుల షాపులో చాలా చాలా జతల చెప్పులు ఉంటాయి. ఒకదానిపై ఒకటి పెట్టి బాక్స్ లలో పెడతారు. వాటన్నింటినీ మనకు కనిపించేలా పెడతారు. సగం చెప్పులు తలకిందులుగానే ఉంటాయి. మరి షాపు తలకిందులు కావడం లేదు కదా ? అని అడిగాను. ట్రాన్స్ పోర్ట్ లో వచ్చేప్పుడు పెద్ద పెద్ద సంచుల్లో చిందరవందరగా వస్తాయి కదా ? మనం మన ఇంటికి కొత్తవి తీసుకొని వచ్చేటప్పుడు కూడా బ్యాగులో పెడతాము, అప్పుడు కూడా తలకిందులుగానే ఉంటాయి కదా అని అడిగాను. చెప్పులు తలకిందులుగా అవ్వడానికి కుటుంబం తలకిందులుగా అవ్వడానికి సంబంధం ఏమిటి అని అడిగాను. చెప్పినట్టు వినాలి కాని ఇలా అన్ని పిచ్చి పిచ్చిగా అడగవద్దు అడిగితే కల్లు పోతాయి అన్నది. ఇది జరిగి 30 ఏళ్ళు అవుతుంది (1995) నాకు ఇంకా కల్లు పోలేదు. ఇట్లు డాక్టర్ బైరి నరేష్ 7013160831 MNS ఫౌండర్, జాతీయ అధ్యక్షుడు చెప్పులకు సంబంధించిన మూఢనమ్మకాలను ఈ రోజు మన MNS జనరల్ వాట్సాప్ గ్రూప్ లలో మీరు కూడా రాయండి. ఈరోజు మీ ఆలోచనలు అనుభవాలు మాత్రమే పంచుకోవాలని విజ్ఞప్తి. సాయంత్రం నేను అన్నీ సేకరించి ఈ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను
👍 😂 🙏 ❤️ 87

Comments