
AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
February 3, 2025 at 04:04 PM
ప్రచురణార్థం 03/02/2025
*ముఖ ఆధారిత అటెండెన్స్ యాప్ లో సి సి ఎల్ ఆప్షన్ ఇవ్వండి* -ఏపీటీఎఫ్ అమరావతి
ముఖ ఆధారిత అటెండెన్స్ యాప్ లో సి సి ఎల్ ఆప్షన్ ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు సి వి ప్రసాద్, రాధాకృష్ణ విద్యా శాఖ ఐటి సెల్ ను కోరారు. 10వ తరగతి వందరోజుల యాక్షన్ ప్లాన్ లో సెలవు దినాలలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. కావున దీనికి అనుబంధంగా ముఖ ఆధారత అటెండెన్స్ యాప్ లో సిసిఎల్ దరఖాస్తుకు ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరారు. అటెండెన్స్ యాప్ లో సదరు ఆప్షన్ లేదన్నారు. ఆరు నెలల లోపే సీసీఎల్ ఉపయోగించుకోవాలన్న సెలవు నిబంధనలలో ఉందన్నారు. దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.