
Motivational By Sridhar Nallamothu
January 22, 2025 at 05:29 AM
ఒక్కసారిగా నేను యూట్యూబ్ మీద పూర్తి ఫోకస్ పెట్టడానికి కారణాలు!
"సర్, మీరు యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టొచ్చు కదా" అని ఎవరైనా అంటే నేను నవ్వుకునే వాడిని. కారణం 2006లో గూగుల్ సంస్థ యూట్యూబ్‌ని కొన్న నవంబర్ 15వ తేదీన, ఇండియాలో మొదలైన మొదటి 10 ఛానెల్స్‌లో నాది ఒకటి. 2015 నాటికే, అంటే పదేళ్ల క్రితమే లక్షకు పైగా సబ్‌స్కైబర్స్ ఉన్న ఛానెల్ నాది.
2006 నుండి మొదలుపెట్టి, 2010 వరకూ చాలా అగ్రెసివ్‌గా చేశాను. అప్పటికి మోనిటైజేషన్ కూడా ఉండేది కాదు. అంతా ఫ్రీ కంటెంటే! అయినా కూడా నేను ఏరోజూ డబ్బుల కోసం పరిగెత్తలేదు కాబట్టి అసలు మోనిటైజేషన్ అనేది యూట్యూబ్‌లో లేనే లేని రోజుల్లో గ్రీన్ మ్యాట్ తెచ్చుకుని, అడోబ్ ప్రీమియర్‌లో ఎడిటింగ్ చేస్తూ, ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో యానిమేషన్స్, టైటిల్స్ 20 సెకన్ల క్లిప్‌కి కొన్ని గంటల రెండరింగ్ పెట్టి ఎన్నో ప్రయోగాలు చేశాను.
2010లో నాకు iNewsలో టివి షోస్ మొదలయ్యాయి. అదే ఇయర్ ETVలో సఖి.కామ్, ABN, TV9, TV5 ఇలా వరుసపెట్టి ఈ పదిహేనేళ్లలో రోజూ ఛానెల్స్ చుట్టూ పరిగెత్తాల్సిన పరిస్థితి. వరుసపెట్టి ప్రోగ్రాములు. తినడానికి కూడా టైమ్ ఉండేది కాదు. ఏమన్నా డబ్బులు వస్తాయా అంటే అంతా ఫ్రీ సర్వీస్. సమాజం కోసం చేస్తున్నాములే అనే ఓపెన్ మైండ్‌తో నా విలువైన సమయం నా కోసం కాకుండా ఛానెల్స్ కోసం వెచ్చించాను.
దీంతో నాకు యూట్యూబ్‌లో వీడియోలు చెయ్యడానికి టైమ్ ఉండేది కాదు. అదీ గాక బీరువాలో జీలకర్ర పెడితే అదృష్టం వంటి వీడియోలను, రాజకీయ నాయకులు బూతులు తిట్టుకునే వీడియోలను, నోటికొచ్చినట్లు మాట్లాడి రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అయిన వాళ్లనీ లక్షల వ్యూస్‌తో జనాలు ఆదరించడం మొదలుపెట్టాక ఓ రకంగా తెలుగు సమాజం అంటే చాలా చిన్నచూపు ఏర్పడింది. ఇప్పటికీ ఓ ఆకర్షణీయమైన టైటిల్ పెట్టకపోతే, థంబ్‌నెయిల్ పెట్టకపోతే జనాలు ఎంత మంచి వీడియో అయినా చూడని పరిస్థితి చూసి విసుగు, ఏంటీ సమాజం అని!!
మరో వైపు న్యూరాలజీ, ఎపిజెనెటిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఫిలాసఫీ, సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ వంటి ఎన్నో రంగాల్లో నిరంతరం నేర్చుకుంటూ సాధన చేస్తూ వచ్చాను. నాకు ఎప్పుడూ ఓ అసంతృప్తి వెంటాడుతుంది. నా నోటి నుండి సరస్వతి ప్రవాహంలా వస్తుంటుంది. కానీ ఈ సొసైటీలో అంత జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఓ ప్లాట్‌ఫాం లేదే అన్న భావన.
ఏదో ఛానెల్ వాళ్లు పిలిస్తే వెళ్లి మాట్లాడడం ఏంటి? నా నాలెడ్జ్ ని చూసి నా దగ్గర స్వయంగా నేర్చుకుందామని వచ్చే వాళ్లతో ఓ బలమైన వేదిక నిర్మిద్దామని ఫైనల్‌గా నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకూ స్పిరిట్యువాలిటీ పేరిటా, మోటివేషన్ పేరిటా ఎవరూ ప్రస్తావించని అరుదైన టెక్నిక్స్, లోతైన సాధనలు, విషయాలు, ఫిలాసఫీ లోతులు పరిచయం చెయ్యాలని భావిస్తున్నాను
15 ఏళ్లుగా టివి ఛానెళ్లకి, యూట్యూబ్ ఛానెళ్లకి ధారపోసిన నా సమయాన్ని ఇకపై నా కోసం, నన్ను నమ్ముకుని నా ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ల కోసం కేటాయించదలుచుకున్నాను.
విశ్వం నాకు ఇస్తున్న అపారమైన జ్ఞానాన్ని అంతే అన్ కండిషనల్ గా పంచబోతున్నాను.
మీరు ఈ లింక్‌లో సబ్‌స్కైబ్ చేసుకోవచ్చు. https://www.youtube.com/@sridharnallamothu
ఖచ్చితంగా తెలుగులో ఓ అత్యుత్తమైన విలువలు, కంటెంట్ కలిగిన ఛానెల్‌గా దీన్ని నిలబెట్టబోతున్నాను.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
❤️
👍
🙏
👏
💥
😂
48