AP UPDATES OFFICIAL
AP UPDATES OFFICIAL
January 24, 2025 at 02:44 AM
*బదిలీలు--points* వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడాంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. క్రీడా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో వారి విద్యార్థులు పాల్గొన్నారా? ఆవా ర్థులు సాదించారా? అనే ప్రాతిపదికన బదిలీల్లో పాయింట్లు ఇస్తారు. జాతీయ స్థాయిలో పాల్గొనే స్థాయికి తీసుకెళ్తే రెండు పాయింట్లు, అవార్డు సాదిస్తే మూడు పాయింట్లు ఇస్తారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. సైన్స్ టీచర్లకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లను ప్రామాణి కంగా తీసుకుంటారు. ఆ ఫెయిర్లలో వారి విద్యార్థుల ఎన్ని ప్రాజెక్టులు ప్రద ర్శించారు? వాటికి ఎలాంటి ప్రశంస లభించింది? అనేది ఆధారంగా పాయింట్లు ఇస్తారు. సోషల్ టీచర్లకు క్విజ్లు, జనరల్ నాలెడ్జ్ పోటీలను ప్రామాణికంగా చూస్తారు. హిందీ టీచర్లకు.. విద్యార్థులు మాధ్యమిక లాంటి పరీక్షలు రాశారా? వారి ప్రతిభ ఏ స్థాయిలో ఉందనేది పరిగణనలోకి తీసుకుంటారు. గణిత ఉపాధ్యాయులకు విద్యార్థులు ఒలంపియాడ్ లాంటి పోటీల్లో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్లారా? బహుమతులు పొందారా? అనేది లెక్క చూస్తారు. ఇంగ్లిష్ టీచర్లకు 'స్పెల్ బీ' పోటీలు, ఇతరత్రా ఆంగ్ల సంబంధిత పోటీల ఆధారంగా పాయింట్లు ఇస్తారు. తెలుగు టీచర్లకు కూడా కొన్ని అంశాలను పెట్టాలనే యోచనలో ఉన్నారు. ఇలా ప్రతి సబ్జెక్టు టీచర్కు కొన్ని అంశాలు ప్రామాణికంగా తీసుకుని, మెరుగ్గా ఉన్నవారికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దానివల్ల మిగిలిన టీచర్లు కూడా వారి విద్యార్థులు మెరుగ్గా ఉంటే, బదిలీల్లో తమకు ప్రాధాన్యత పెరుగుతుందని భావించి వృత్తిలో పోటీ పడతారనే ఆలోచన చేస్తున్నారు.
👍 😢 7

Comments