Prasannakumar Nalle ( JSP Updates )  ✊🏻✊🏻✊🏻
Prasannakumar Nalle ( JSP Updates ) ✊🏻✊🏻✊🏻
January 27, 2025 at 10:53 AM
అమరావతి.. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు,కార్పొరేషన్ లలో ఖాళీగా ఉన్న చైర్ పర్సన్ ,వైస్ ఛైర్పర్సన్,డిప్యూటీ మేయర్ ల ఎంపిక కోసం నోటిఫికేష్ విడుదల. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నెల 30 లోగా ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. వచ్చే నెల మూడో తేదీన పరోక్ష పద్ధతిలో ఎన్నిక. తిరుపతి,నెల్లూరు,ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్లు,నందిగామ,హిందూపురం,పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ లకోసం ఎన్నిక. బుచ్చిరెడ్డిపాలెం,నూజివీడు,తుని,పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్ పర్సన్ ల కోసం జరగనున్న ఎన్నిక. ఆయా మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని.
👍 ❤️ 9

Comments