
VRK's PMF DIET UNIVERSAL
January 10, 2025 at 07:45 AM
🫓🥗🥘🫓🥗🥘🫓🥗🥘
*VRK డైట్ లో రోజూ చపాతీలు ఇంటిలోనే తయారు చేసుకొని తినవచ్చు.*
🫓🥗🥘🫓🥗🥘🫓🥗🥘
*కావలసిన పదార్థాలు(ఇద్దరికి):*
1. కురిడీ కొబ్బరి పొడి - 100gms
2. ఆవిశ గింజల పొడి 6 స్పూన్స్ లేదా Physillium Husk/ఇసబ్ గోల్ పీచు పొడి - 3gms లేదా 2-3 గ్రుడ్లు
3. నట్స్ మరియు సీడ్స్ పొడి - 15 స్పూన్స్
4. రుచికి తగినంత ఉప్పు(మెత్తగా దంచుకొన్నది)
5. మంచి నీళ్లు
6. బటర్ పేపర్/తడిపి పిండుకోన్న కాటన్/బన్నీ వస్త్రం
7. కొబ్బరినూనె/నెయ్యి
🫓🥗🥘🫓🥗🥘🫓🥗🥘
*పిండి కలుపుకొనే విధానం:*
1. ముందుగా పొడులు అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు చేర్చుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసి మెత్తని ముద్దగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు తడిపి పిండుకొన్న వస్త్రాన్ని గిన్నెపై కప్పి ఒక 15-20 నిముషాలు నాననివ్వండి.
3. తదుపరి అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళు/కొబ్బరినూనె కలిపి మరలా కలిపి చపాతీ ఉండలుగా ఒక 4/6 వచ్చేవిధంగా చుట్టుకోవాలి.
4. పొయ్యిమీద పేణం పెట్టుకొని సిమ్ (తక్కువ సెగ) లో పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఒక పీట మీద బటర్ పేపర్/తడిపి పిండుకోన్న కాటన్/బన్నీ వస్త్రాన్ని పరుచుకొని ఒక పిండి ఉండ తీసుకొని చేతితో వత్తుతూ చపాతీ మాదిరి చేసుకోవాలి.
6. ఇప్పుడు వస్త్రంతో సహా చపాతీని పెణం మీద బోర్లా వేసుకొని మెల్లగా వస్త్రం/పేపర్ తీసి, సన్నని మంటపై కొబ్బరినూనె/నెయ్యితో రెండువైపులా కాల్చుకోవాలి.
🫓🥗🥘🫓🥗🥘🫓🥗🥘
*గమనిక:*
1. Physillium Husk/ఇసబ్ గోల్ పీచు పొడి దొరకని లేదా వాడటం ఇష్టంలేని వాళ్ళు దాని బదులుగా 6 చెంచల ఆవిశ గింజల పొడి లేదా 2-3 గ్రుడ్లు నీళ్లకు బదులుగా చేర్చుకొని చపాతీ ముద్ద చేసుకోవచ్చు.
2. కొబ్బరి కురిడీలు హోల్ సేల్ మార్కెట్లో కిలో 240-300కు అందుబాటులో ఉన్నాయి. తెచ్చుకొని వాడుకోవచ్చు.
3. *VRK డైట్ లో అనుమతి ఉన్న కూరగాయలు ఆకుకూరలతో మీకు నచ్చిన కూర చేసుకుని తీసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా తీసుకోవచ్చు. కూర గుజ్జులా కావాలి అనుకుంటే నట్స్ మరియు సీడ్స్ పొడి 2-3 స్పూన్స్ నీళ్ళతో మిక్సి చేసి కూరలో కలిపి చేసుకోవచ్చు.*
🫓🥗🥘🫓🥗🥘🫓🥗🥘
❤️
😢
2