VRK's PMF DIET UNIVERSAL WhatsApp Channel

VRK's PMF DIET UNIVERSAL

4.1K subscribers

About VRK's PMF DIET UNIVERSAL

*Here you will find all the Latest Updates, Announcements and Information related to Veeramachaneni Rama Krishna (VRK's) Protein deficit Metabolic Fat (PMF) Diet.*

Similar Channels

Swipe to see more

Posts

VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
5/15/2025, 10:53:31 AM

☘☘☘☘☘☘☘☘☘☘☘ *POTKLOR SYRUP is used for Hand/Leg Muscle Cramps and Severe Back Pain that may possibly occur during Liquid Diet.* It's not much needed if you are in Solid Diet with Balanced Vegetables and Greenies consumption. *For Potklor Syrup,* Check with your pharmacist for *Pottasium Chloride Oral Suspension Sugar Free* Syrup For Dieters in abroad, tryout *Kal Pottasium 99* or *Holland & Barrett Potassium 99 mg* Tablets(1 per day for 5 days) may be used as a substitution for Pottasium Deficiency. ☘☘☘☘☘☘☘☘☘☘☘ *లిక్విడ్ డైట్ సమయంలో సంభవించే చేతి/కాళ్ల కండరాల తిమ్మిరి మరియు వెన్నునొప్పికి పాట్‌క్లోర్ సిరప్ ఉపయోగించబడుతుంది.* మీరు సాలిడ్ డైట్‌లో ఉండి, సమతుల్య కూరగాయలు మరియు ఆకుకూరలు తీసుకుంటే ఇది అంతగా అవసరం లేదు. *పోట్‌క్లోర్ సిరప్* కోసం, *పొటాషియం క్లోరైడ్ ఓరల్ సస్పెన్షన్ షుగర్ ఫ్రీ* సిరప్ కోసం మీ ఫార్మసిస్ట్‌ను సంప్రదించండి విదేశాలలో డైటింగ్ చేసేవారు, పొటాషియం లోపానికి ప్రత్యామ్నాయంగా *కాల్ పొటాషియం 99* లేదా *హాలండ్ & బార్రెట్ పొటాషియం 99 mg* మాత్రలను (రోజుకు 1 చప్పున 5 రోజులు) ప్రయత్నించవచ్చు. ☘☘☘☘☘☘☘☘☘☘☘

👍 ❤️ 😢 9
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
5/15/2025, 10:43:56 AM

☘☘☘☘☘☘☘☘☘☘☘ *వేసవిలో కమ్మని రుచికరమైన మసాలా మజ్జిగ చేసుకునే విధానం:* చిన్న ముక్క అల్లం, చిన్న పచ్చి మిరపకాయ ముక్క దంచుకొని, అందులో అర స్పూను ముందుగానే చేసుకొన్న జీలకర్ర, వాము పొడి, రెండు స్పూన్ల పెరుగు కలిపి లీటరు నీళ్లతో మజ్జిగ చేసుకోవాలి. దీనిని వడబోసుకొని అందులో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, నిమ్మ రసం కలుపుకొంటే కమ్మని మసాలా మజ్జిగ త్రాగటానికి సిద్ధం. దీనిని ఉప్పు అవసరం లేకుండానే చాలా ఇష్టంగా త్రాగవచ్చు. ☘☘☘☘☘☘☘☘☘☘☘ *Preparation of Delicious Summer Drink, Spicy Buttermilk:* Stone crush short piece of ginger, small piece green chilli and add half spoon pre-prepared Cumin and Ajwain powder, two spoons Curd and prepare Buttermilk with 1 litre Water. Now filter out the solid stuff and add finely chopped coriander and curry leaves, Lemon juice to the Buttermilk. Delicious Spicy Buttermilk is ready for Serving. This will taste great even without mixing Sea Salt. ☘☘☘☘☘☘☘☘☘☘☘

👍 😢 10
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
5/29/2025, 9:28:47 AM

🥵🥴😵‍💫🦵💪🤒🤕 *లో కార్బ్, హై ఫ్యాట్ డైట్ చేసేటప్పుడు కొద్దీ మందిలో తేలికపాటి జ్వరం, కళ్ళు తిరుగుతున్నట్లు ఉండటం, కాళ్ళు, చేతులు కొంకర్లు తిరిగినట్లు, తిమ్మిర్లు, మొద్దుబారినట్లు ఉండటం, నడుము విరిచినట్లు, కదలలేనట్లు అనిపించడం, విపరీతమైన తలపోటు చూస్తూ ఉంటాం.* *ఇందుకు ప్రధాన కారణాలు పరిష్కారాలు:* 1. *శరీరానికి సరిపడా నీళ్ళు తీసుకోకపోవడం* (కనీసం 4 లీటర్లు నీళ్ళు తీసుకోవాలి), 2. *శరీరానికి అందవలసిన సూక్ష్మపోషకాలు అనగా ఖనిజలవాణాలు, విటమిన్లు అందకపోవడం* (ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా డైట్ లో అనుమతి ఉన్న అన్ని రకముల కూరగాయలు, ఆకుకూరలు, మాంసకృత్తులు విధిగా తీసుకోవాలి, కూరగాయగా తీసుకోవటం ఇష్టం లేకపోతే, సూప్స్ రూపంలో తీసుకోవాలి), 3. *శరీరానికి సరిపడా ఫ్యాట్ అందకపోవడం* (డైట్ ద్వారా శరీరానికి గ్లూకోస్ తగ్గిస్తూన్నము కాబట్టి అందుకు ప్రత్యాన్మయంగా కనీసం 40gms తగ్గకుండా ఫ్యాట్ తప్పనిసరిగా తీసుకోవాలి) 4. *డైట్ నిర్దేశించిన 6 పిల్లర్స్ విధిగా తీసుకోకపోవడం* (40-80gms డైరెక్ట్ ఫ్యాట్, 3 నిమ్మకాయలు, 4 లీటర్ల నీళ్ళు, 1 లేదా 2 మల్టీవిటమిన్, 1000 mg ఫిష్ ఆయిల్ మరియు విటమిన్ డి మాత్రలు తప్పనిసరిగా ప్రతిరోజూ తీసుకోవాలి) *సాదారణంగా డైట్ చేసే మొదటి 10-20 రోజుల్లో ఈ సమస్య చాలా మందిలో వస్తూ ఉంటుంది. మన శారీరానికి ఇప్పటికే గ్లూకోస్ ఇంధనం మీద నడవటం అలవాటు అయి ఒక్కసారిగా గ్లూకోస్ బదులు ఫ్యాట్ ఇవ్వటం చేత మారే ప్రక్రియలో ముందు ఇబ్బంది పడుతుంది.* వీటిలో కొన్ని లక్షణాలు కీటో ఫ్లూ కారణంగా కూడా వస్తాయి. *అవసరం అనిపిస్తే జ్వరానికి, ఓళ్లు నెప్పులకు మాత్రలు వాడుకోవచ్చు. కానీ పైన సూచించిన 4 సూచనలు తప్పనిసరిగా పాటించాలి* 🥵🥴😵‍💫🦵💪🤒🤕

👍 ❤️ 🙏 😂 🚬 19
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
5/23/2025, 10:05:31 AM

☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *List of Allowed, Limited and Restricted Vegetables & Foods in VRK Diet* *VRK డైట్ లో అనుమతి ఉన్న, మితముగా తీసుకోవలసిన మరియూ నిషిద్ధమైన కూరగాయలు, ఆహారాల జాబితా* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️

Post image
👍 🙏 🎉 9
Image
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
5/23/2025, 9:27:17 AM

☘☘☘☘☘☘☘☘☘☘☘ *ఆస్తమా సమస్యలకు ఉపశమనం కొరకు* *జల్ నేతి (Jal Neti)* *అవసరమైనవి:* * నేతి పాత్ర * ఒక చిటికెడు ఉప్పు * గోరువెచ్చని నీరు -యోగులు శ్వాస మార్గాలను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించేవారు. దంతాల శుభ్రతకు బ్రష్ చేయడం వంటిదే, జల్ నేతి ముక్కు శుభ్రతకు ఉపయోగపడుతుంది. -తలను ఒక పక్కకు వాల్చి, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో ఒక ముక్కు రంద్రము నుండి మరో రంద్రము ద్వారా విడిచిపెట్టినకో గొంతు వరకు శ్వాస మార్గాలను శుభ్రం చేస్తుంది. ఇలా పాత్రలో నీటితో రెండు వైపల చెయ్యాలి. *ఈ ప్రక్రియ చేస్తునంతసేపు నోరు తెరిచి ఉంచి శ్వాస తీసుకోవాలి.* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *5 యోగా శ్వాస వ్యాయామాలు (Pranayama)* *సూచనలు:* * సుఖాసనంలో కూర్చొని, వెన్ను నిటారుగా ఉంచండి. * ఆలోచనలు తగ్గించి ధ్యాసను శ్వాసపై కేంద్రీకరించండి. * ప్రారంభంలో యోగా గురువు మార్గదర్శనంలో చేయండి. *1. అనులోమ-విలోమ (Nadi Shodhana)* - కుడి ముక్కును బొటనవేలితో మూసి, ఎడమ ముక్కుతో ఊపిరి పీల్చండి. - ఎడమ ముక్కును మధ్యవేలితో మూసి, కుడి ముక్కుతో ఊపిరి విడవండి. - ఇలా రెండు వైపులా చెయ్యాలి. - *సమయం:* 2-5 నిమిషాలు. *2. భ్రామరి (Bhramari)* - చెవులను బొటనవేళ్లతో మూసి, ఇతర వేళ్లతో కళ్లను మూసుకోండి. - ముక్కుతో ఊపిరి పీల్చి, కొద్దిసేపు ఊపిరి బిగపెట్టి, మ్ అను ధ్వనితో ఊపిరి నెమ్మదిగా విడవండి. - *పునరావృత్తి:* 5 సార్లు. *3. ఉజ్జాయి ప్రాణాయామం* - ఊపిరి పీల్చి, తల ముందుకు వాల్చి, గొంతు నుండి శబ్దం వచ్చేలా ఊపిరి పీల్చండి. - కుడి ముక్కును మూసి, ఎడమ ముక్కుతో ఊపిరి విడవండి. ఇలా రెండు వైపులా చెయ్యండి. - *పునరావృత్తి:* 10-12 సార్లు. *4. కపాలభాతి (Kapalbhati)* - సాధారణంగా ఊపిరి పీల్చి, బలంగా ఊపిరి విడవండి. - ఊపిరి విడుదల సమయంలో కడుపును వెన్నెముక వైపు లాగండి. - *సమయం:* 2-5 నిమిషాలు. *5. భస్త్రిక (Bhastrika)* - బలంగా ఊపిరి పీల్చి, కడుపును విస్తరించండి. - బలంగా ఊపిరి విడిచి, నాభిని లోపలికి లాగండి. - *సమయం:* 1-2 నిమిషాలు. ☘☘☘☘☘☘☘☘☘☘☘ *ఆవిరి పట్టుట* - నీటిలో పసుపు, వేపాకు & తులసీ ఆకులను వేసి కాయండి. - వేడి నీటిని పాత్రలో పోసి, తలపై తువాలా/దుప్పటి వేసుకుని ఆవిరిని పీల్చండి. *ఫలితాలు:* - శ్వాస మార్గాలు స్వచ్ఛమవుతాయి. - ఆస్తమా, అలర్జీలకు ఉపశమనం. *గమనిక:* ప్రతిరోజు ఉదయం ఈ పద్ధతులను అనుసరించండి. 🌿 ☘☘☘☘☘☘☘☘☘☘☘

🙏 😢 3
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
2/20/2025, 2:36:49 AM

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *VRK డైట్ గురించి ఏమి తెలవకుండా, ఎలా చెయ్యాలో, ఏమి తినాలో తెలియకుండా దయచేసి డైట్ చేయవద్దు అని సభ్యులందరికీ మనవి...* *రేపటి రోజు మీ కుటుంభంలోనో, మిత్రులలోనో, బంధువులలోనో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటూ మీ దగ్గరకు డైట్ గురించి తెలుసుకోవటం కోసం సహాయం కోరి వస్తే వాళ్ళకు మీరు ఏమి చెబుతారు.* *ముందుగా VRK గారి ఫుల్ మీటింగ్ వీడియొలు(4-5 గంటల నిడివి ఉన్నవి) ఒకటికి రెండు సార్లు చూడండి. డైట్ వెనక ఉన్న శాస్త్రీయతను సంపూర్ణంగా అర్ధం చేసుకోండి. ఒక నోట్స్ తయారు చేసుకోండి.* *మనం జీవించటానికి తీసుకొనే ఆహారం పట్ల అవగాహన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా తీసుకొనే ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యలు ఎదుర్కొంటారు.* *ఈ డైట్ అన్ని రకముల జీవనశైలి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతలు, ఆటో ఇమ్యూన్ సమస్యల నుండి మనలను తేలికగా బయటపడవెయ్యగలదు.* *లేదంటే ధనం దాహం కలిగిన కొంత మంది వైద్యులు మీకు ఆహారం పట్ల అవగాహన కల్పించక పోగా, ఈ సమస్యలకు రోగం పేరు చెప్పి జీవితాంతం మందులు వాడవలసిందే అని, మీ ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తారు. అటువంటి వారు ఇచ్చే మందులకు ఈ సమస్యలు తగ్గకపోగా మన శరీరం గుల్లవుతుంది. తస్మాత్ జాగ్రత్త!* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

❤️ 2
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
2/20/2025, 2:38:16 AM

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *డైట్ చేసే డైటర్స్ కు మనవి:* డైట్ కు సంబందించి మీకు ఉన్న అన్ని సందేహాలూ అడ్మిన్స్ కు వ్యకిగతంగా కాకుండా మీరు ఉన్న డైట్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. డైట్ గ్రూప్స్ ఏర్పరచటంలో ప్రధాన ఉద్దేశ్యం అదే. *డైట్ గ్రూప్ లో మీరు పెట్టిన ప్రశ్న/సందేహానికి ఒక వేళ సమాధానం రాకపోతే, ఇంతక ముందు మీరు పంపిన మెసేజ్ టాగ్ చేస్తూ మరల పోస్ట్ చెయ్యండి. కొన్ని సార్లు వివిధ డైట్ గ్రూప్స్ లో వందల సంఖ్యలో సందేహాలు నివృత్తి చేస్తూ కొన్ని గ్రూప్స్ లో కొందరి మెసేజ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కావున గమనించగలరు.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *Request to all the Dieters:* Please post all the doubts related to the Diet in your respective Diet Groups only instead of posting them to admins personally, so that it will be useful for everyone. Infact that is the main motto of setting up Diet Groups. *If your question/doubt is not answered in the Diet Group, post it again tagging the message you sent earlier. Sometimes, while clearing hundreds of doubts in various diet groups, there is a possibility that some messages may be missed in some groups.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

❤️ 1
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
2/20/2025, 2:36:54 AM

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *VRK డైట్ విధానం అనేది అన్ని జీవనశైలి లోపాలు, హార్మోన్ల అసమతుల్యత మరియు ఆటో-ఇమ్యూన్ డిజార్డర్‌లకు ఒకే విధంగా ఉంటుంది.* అయితే, కొన్ని స్వయం ప్రతిరక్షక రుగ్మతలు, చాలా తక్కువ సంఖ్యలో హార్మోన్ల అసమతుల్యత కేసులకు మరియు మీ ఆరోగ్య పరిస్థితి యొక్క తీవ్రత ఆధారంగా VRK డైట్‌తో పాటుగా *నిర్దిష్ట సాంప్రదాయ సప్లిమెంటేషన్ అవసరం కావచ్చు.* *ముందుగా మీరు VRK డైట్ యెక్క పూర్తి నిడివి (3-5 గంటలు) ఉన్న మీటింగ్ వీడియోలను చూడాలి మరియు డైట్ కాన్సెప్ట్‌ల పూర్తి సారాంశాన్ని అవలోకనం చేసుకొని వెంటనే మీ డైట్ ప్రయాణాన్ని ప్రారంభించగలరు...* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *VRK Diet remains the Same for all Lifestyle Disorders, Hormonal Imbalances and Auto-Immune Disorders.* However, *Specific Traditional Supplementation may be necessary along with the VRK Diet* for a few autoimmune disorders and very few Hormonal Imbalance Cases based on the severity of the health condition. *You can watch VRK Diet Full Meeting Videos and get some gist of Diet Concepts and Start your journey right away...* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

❤️ 1
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
2/20/2025, 3:02:56 AM

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *VRK డైట్ చెయ్యాలి అనుకొంటే ఎవరినీ కలవాల్సిన అవసరంగానీ, ఏ ఆఫీస్ కూ వెళ్లాల్సిన అవసరం గానీ, ఎవరికీ డబ్బులు కట్టాల్సిన అవసరం గానీ ఎంత మాత్రం లేదు...* *ముందుగ VRK గారి 3-5 గంటల పూర్తి మీటింగ్ వీడియోస్ ఒకటికి రెండుసార్లు చూసి నోట్స్ రాసుకొని డైట్ పట్ల ఒక అవగాహనకు రండి. పూర్తి అవగాహనతో డైట్ మొదలుపెట్టండి.* *డైట్ చేస్తున్న క్రమంలో ఇంకా ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే మీరు ఉన్న వాట్సప్/ఫేస్బుక్ /ఇన్స్టాగ్రం గ్రూప్ లో పోస్ట్ చెయ్యండి. డైట్ అడ్మిన్స్ మీ సందేహాలను నివృత్తి చేస్తారు.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *For Starting VRK Diet, you don't need to Meet anyone in person nor you need to go to any office neither you Even don't need to pay a single rupee to any body...* *First of all you have to watch 3-5 hours Full Meeting Videos of VRK sir, make a notes and understand the basic science behind and concepts of Diet.* *During the course of Diet, if you have any issues or doubts, Just ping in your quires in our WhatsApp, Facebook or Instagram groups. One of our Diet admins will be happy to address the issues.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

👍 😮 2
VRK's PMF DIET UNIVERSAL
VRK's PMF DIET UNIVERSAL
2/20/2025, 2:36:22 AM

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ *డైట్ చెయ్యాలి అనుకొనే వారికి ముఖ్య గమనిక:* నాకు షుగర్ ఉంది సార్, ఎమి తినాలో చెప్పండి? నాకు బిపి ఉంది అండి, ఎమి తినాలో చెప్పండి? నేను థైరాయిడ్ కి డైట్ ఎలా చెయ్యాలి? నేను 100gms ఫ్యాట్ ఒకేసారి త్రాగలేకపోతున్నాను, ఏమి చెయ్యమంటారు? సార్, డైట్ 4 రోజుల నుండి చేస్తున్నాను, వాంతులు విరేచనాలు అవుతున్నాయి, బిళ్ళలు చెప్పండి... నేను 90 రోజుల నుండి డైట్ చేస్తున్నాను, నాకు బీపీ కంట్రోలు అవ్వటం లేదు? డైట్ చెయ్యాలా ఆపెయ్యమంటారా చెప్పండి... తరచూ డైట్ గ్రూప్స్ లో ఇలాంటి ప్రశ్నలు వింటూనే ఉంటాం... *VRK గారు ఇటువంటి సాధారణ ప్రశ్నలకు ఇప్పటికే తన మీటింగ్ విడియోలలో 6-8 ఏళ్ల క్రితమే విస్తృతంగా చర్చించారు.* *అందు కోసం ముందుగా డైట్ గురించి అవగాహన ఏర్పరచుకోవటానికి VRK గారి పూర్తి నిడివి ఉన్న 4-5 గంటల మీటింగ్ విడియోలు ఒకటికి రెండుసార్లు తప్పకుండ చూడండి.* *మీకున్న నూటికి 99 శాతం సందేహాలు తీరిపోతాయి. డైట్ సులభంగా అర్ధం చేసుకుని స్టార్ట్ చెయ్యవచ్చు. ఇక్కడ ఉన్న అడ్మిన్ సభ్యులు అందరూ కూడా ఒకప్పుడు అలా VRK గారి వీడియోలు చూసి చేసినవారే...* *ఇంకా సరళతరం అయిన విషయం ఏమిటంటే అన్ని రకములైన ఆరోగ్య సమస్యలకూ డైట్ విధానం ఒక్కటే. మీ ఎత్తు, బరువు బట్టి మీల్ కౌంట్ మాత్రమే మారుతుంది. [0 మీల్ (లిక్విడ్) నుండి 3 మీల్ వరకు]* *డైట్ చేసేటప్పుడు మీ డైట్ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ సభ్యులు వారి ఉద్యోగ, వ్యక్తిగత విరామ సమయాలలో వీలు చూసుకొని మీకు కలిగిన సందేహాలూ నివృత్తి చేస్తారు.* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

❤️ 👍 😢 3
Link copied to clipboard!