
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
January 26, 2025 at 01:51 AM
బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే "సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు" - 2025
మొదటి రోజు (25-1-2025)
విశాఖపట్నంలో పూజ్య గురుదేవులు 'ప్రవచన చక్రవర్తి' బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములు నిన్న (25-01-2025) వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. కొమ్మాదిలోని గాయత్రీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన ఈ ప్రవచనములు 42 రోజులపాటు కొనసాగుతాయి. మొదటి రోజు ప్రవచనములో శ్రీ రామాయణము యొక్క వైభవము, వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనము, నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పిన సంక్షేప రామాయణము, శ్రీ రామాయణ ఆవిర్భావ ఘట్టము, అయోధ్య నగరం మరియు ప్రజల శీల వైభవములను గూర్చి గురువుగారు ప్రవచించారు. తాను చదువుకుని, ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన విశాఖపట్నం నగరములో మూడవమారు సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనం చేయటం శ్రీ రామానుగ్రహమని పూజ్య గురువు గారు తమ సంతోషమును వ్యక్తం చేసారు.
శ్రీ రామాయణం మనిషిని సంస్కారవంతముగా తీర్చిదిద్దుతుంది అని, మానవ జీవితంలోని మౌలిక విలువలు, నీతి నియమములు మనందరికీ నేర్పించడానికి రామాయణం కన్నా గొప్ప కావ్యం లేదని గురువుగారు తెలియజేసారు.
🙏
❤️
👍
🤭
157