RTV Telugu (Raise Ur Voice)
RTV Telugu (Raise Ur Voice)
February 5, 2025 at 04:40 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 TMC నీళ్లు వదలండి కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని కోరిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే ల బృందం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీకే శివకుమార్, అధికారులతో తెలంగాణ మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోనీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ తో కలిసి వినతి పత్రము అందజేశారు. త్వరలో వేసవికాలం వస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి పాలమూరు రైతులు, ప్రజల శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకొని సాగు, తాగునీటి అవసరాలకై ఇబ్బందిగా ఉన్నది కావున ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దిగువనున్న జూరాల ప్రాజెక్టుకు ఐదు టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని కోరారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ..... కర్ణాటక రాష్ట్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా కు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, రైతులు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, రైతుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Comments