Polity Guru
January 21, 2025 at 05:54 AM
Bangladesh Constitutional Changes
యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దేశంలో ద్విసభ పార్లమెంట్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రధాని పదవికి టూ-టెర్మ్ లిమిట్ మాత్రమే ఉండాలని ప్రతిపాదించింది. అంటే బంగ్లాదేశ్ ప్రధాని పదవిని ఎవరైనా కేవలం రెండు సార్లు మాత్రమే చేపట్టడానికి అవకాశం ఉండాలని సూచించింది.
బంగ్లాదేశ్ రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాదం, సోషలిజం, జాతీయవాదం, ప్రజాస్వామ్యం అనే 4 ప్రాథమిక భావనలు ఉన్నాయి. వీటిలో మొదటి మూడింటిని తొలగించాలని కమిషన్ సూచించింది. కేవలం 'ప్రజాస్వామ్యం' అనే పదం మాత్రమే రాజ్యాంగ ప్రవేశికలో ఉంచాలని పేర్కొంది.
కొత్తగా సమానత్వం, గౌరవం, సామాజిక న్యాయం, బహుళత్వం (ప్లూరలిజం) సూత్రాలను ప్రతిపాదించింది.
👍
❤️
10