Polity Guru
Polity Guru
January 24, 2025 at 03:27 AM
భారతదేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణంకాల ప్రకారం భారతదేశంలో ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 99.1 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు జరిగిన సమయంలో దేశంలో ఓటర్ల సంఖ్య 96.88 కోట్లుగా ఉంది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవవానికి మూడు రోజుల ముందు (జనవరి 22) ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివరాలను వెల్లడించింది. 1950లో జనవరి 25వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం స్థాపించబడింది. ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
❤️ 👍 😂 😮 22

Comments