
ManaTDP App - Official
February 3, 2025 at 04:20 PM
ఆంధ్రప్రదేశ్ లోని రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్ల భారీ బడ్జెట్ ను కేంద్రం కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది గత యుపిఐ ప్రభుత్వ కేటాయింపుల కన్నా 11 రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు. ఏపీలో రూ.84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని... చంద్రబాబుగారి నుంచి మంచి సహకారం అందుతోందన్న కేంద్ర మంత్రి అందుకు చంద్రబాబుగారికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లను కేటాయిస్తామని అన్నారు. అలాగే 110, 130, 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడవడానికి వీలయ్యే వివిధ రైల్వే ట్రాక్ లను ఏపీలో అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. ఈ మధ్యనే రూ.6,177 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
#chandrababunaidu
#andhrapradesh
👍
❤️
🙏
🫡
26