
Bhakthi Tv
January 29, 2025 at 01:34 AM
29th January 2025
మౌని అమావాస్య :
మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు, సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి, దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది. గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. అలాగే పితృ తర్పణాలకు మౌని అమావాస్య తిథి చాలా మంచి రోజు. పూర్వీకులను గుర్తు చేసుకుని, వారిని స్మరిస్తూ ఆశీస్సులు పొందుతారు. ధ్యానం, మంత్రోచ్ఛారణ, సంగీతం వినడం వల్ల మానసిక ప్రశాంతత, శాంత గుణం అలవడతాయి. మనస్సు మన అధీనంలో ఉంటుంది. మౌని అమావాస్య రోజున శనిదేవుడిని కూడా పూజిస్తారు. తిలలు, నూనెతో అభిషేకం చేస్తారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల గత జన్మలో పాపాలు తొలగిపోతాయి. రోజంతా మౌనవ్రతం చేయలేని వారు మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్మతో రాసి అరచేతుల్లో ఉంచి, దానినే కళ్లార్పకుండా చూడాలి. ఇలా ఎంతసేపు చూడగలిగితే అంత వరకూ చూసి, రెప్పలు వేసే సమయ
🙏
❤️
👍
25