
Bhakthi Tv
February 1, 2025 at 06:35 AM
1st February 2025
మాఘ వినాయక చవితి :
మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే చవితిని మాఘ వినాయక చతుర్థి అంటారు. ఈ రోజు గణపతికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహిస్తారు. గణపతికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు గల మందార పూలు, కలువలతో మాలలు చేసి అలంకరిస్తారు. జిల్లేడు పూలు, గరిక, తుమ్మి పూలు, బిల్వ పత్రాలతో పూజ చేస్తారు. పాయసం, లడ్డులు, మోదకాలు నివేదన చేస్తారు. ఈరోజు అంతా "విఘ్న వినాయకాయ నమః" అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి సంకటాలు తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.
🙏
❤️
👏
🎊
🕉️
46