Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                January 26, 2025 at 03:20 PM
                               
                            
                        
                            ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి..!
* బీసీ, కాపు సంఘాల ధ్వజం..
* రిజర్వేషన్ల అమలులో నిర్దిష్ట హామీ ఇవ్వాలి!
* కులగణన చేయకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..
* రిజర్వేషన్లపై త్వరలోనే కార్యచరణ..!
* విజయవాడలో బీసీవై పార్టీ చర్చ వేదికలో వక్తలు
* రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమం..
బీసీలు, కాపులకు రిజర్వేషన్లు విషయంలో ప్రభుత్వాలు తరచూ మోసం చేస్తున్నాయని.. ఈ మోసాలను ఎంతో కాలం సహించబోమని బీసీ, కాపు సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.. కులగణన చేపట్టి, కులాల సంఖ్య ఆధారంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమం చేసి, ప్రభుత్వాన్ని కూల్చేస్తమని వివిధ ప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ లో "బీసీలకు, కాపులకు రిజర్వేషన్లు అమలు - కులగణన" అంశాలపై చర్చ వేదిక జరిగింది.. 
ముఖ్యంగా ఈ చర్చ వేదికలో విశ్రాంత IAS అధికారి విజయ్ కుమార్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్, ప్రముఖ వైద్యులు ప్రతీప్ సుబ్బారావు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు, కాపు నాడు రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వట్టి మల్లికార్జున ప్రసాద్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ సహా.. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, కాపు సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు, మేధావులు, మీడియా ప్రతినిధులు, ఇతర సంఘాల నుండి భారీగా ప్రతినిధులు హాజరయ్యారు.. 
త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ..!
ఈ చర్చలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానాలపై వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ, బీసీలకు, కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని స్పష్టంగా లేవనెత్తారు.. స్థానిక సంస్థల తరహాలోనే విద్య, ఉద్యోగాల్లో కూడా బీసీలకు కనీసం 39% రిజర్వేషన్లు ఉండాలని, కాపులకు కనీసం 5% రిజర్వేషన్ల అమలు చేయాలని.. దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అమలైతే ఎవరికీ అన్యాయం ఉండదని అభిప్రాయపడ్డారు.. కులగణన విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పి, అమలు చేయకపోతే ప్రభుత్వాలపై యుద్ధం ప్రకటించి, వీధి పోరాటాలకు సిద్ధమని కొందరు ప్రతినిధులు పేర్కొన్నారు.. మొత్తం అందరి అభిప్రాయాలు, చర్చను మొత్తం సమీక్షించి, అందరితో మాట్లాడిన అనంతరం రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. "బీసీలు, కాపులకు జరుగుతున్న అన్యాయం కళ్ళకు కనిపిస్తోంది.. మనం కలిసి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది.. ప్రభుత్వానికి కొంత గడువు ఇద్దాం.., అనంతరం మనం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిద్ధాం" అన్నారు.. బీసీలు, కాపులతో సహా మైనారిటీ, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా బీసీవై పార్టీ పోరాడుతుందని తెలిపారు..
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        1