Bharatha Chaitanya Yuvajana Party | భారత చైతన్య యువజన పార్టీ | BCY Party
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 9, 2025 at 02:46 PM
                               
                            
                        
                            Big Breaking News...
పత్రికా ప్రకటన:
Ramachandra Yadav, BCY Party Chief 
కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసిన రామచంద్ర యాదవ్..
* సావిత్రీభాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని వినతి..
* ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి, పాలన, రాజకీయ అంశాలపై చర్చ..
* అరగంట పాటు జరిగిన భేటీలో కీలక అంశాలపై చర్చ..
దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రి భాయి పూలేకు ప్రతిష్టత్మాకమైన భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు, అక్రమ కేసుల వ్యవహారాన్ని వెలికి తీయాలని ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కోరారు.. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో ఆదివారం సాయంత్రం ఆయన కలిశారు.. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ అంశాలు, గత ప్రభుత్వ నిర్వాకాలు, ప్రస్తుత సమస్యలు.. ఇలా అనేక అంశాలపై చర్చించారు..
సావిత్రీభాయి పూలేకు ఆ అవార్డు!!
కలిసిన వెంటనే ముందుగా ఢిల్లీ ఎన్నికల గెలుపుపై శుభాకాంక్షలు చెప్పిన ఆర్సీవై..  “సావిత్రీభాయి పూలే గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని వినతి పత్రం అందించి.., ఆ అవసరాన్ని, ఆవశ్యకతను వివరించారు.. జనవరి 3 వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని.. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వేడుకలు.. ఆ వేదికపై ఆర్సీవై మాట్లాడిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం అందించారు.. అనంతరం రాష్ట్ర అంశాలపై మాట్లాడారు.., రాష్ట్ర పరిపాలన, ప్రగతి, ప్రధాన సమస్యలు సహా గత ప్రభుత్వం హయాంలో అనేక వర్గాలపై పెట్టిన అక్రమ కేసులను ఓ సారి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.. అలాగే రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం విరివిగా నిధులివ్వాలని  కోరారు.. రాష్ట్రంలో ఇటీవల రాజకీయంగా అత్యంత కీలకంగా అడుగులు వేస్తున్న తరుణంలో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అమిత్ షాను కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది..!
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👌
                                        
                                    
                                        
                                            🔥
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        4