
Venukumar Study Guide
January 30, 2025 at 12:14 AM
*🔊📦MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న*
*🔶షెడ్యూల్ విడుదల*
*🔷ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో అమల్లోకి ప్రవర్తనా నియమావళి*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు శాసనమండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంతోపాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ప్రస్తుతం మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికలు జరిగే ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.*
*💥ఏపీలోనూ విడుదల*
*🌀ఏపీలో తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. ఆయా స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇల్లా వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మల పదవీకాలం మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న ఆయా స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.*
*💥ఇదీ షెడ్యూల్*
*➡️నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 3*
*➡️నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: ఫిబ్రవరి 10*
*➡️పరిశీలన: ఫిబ్రవరి 11*
*➡️ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 13*
*➡️పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27*
*➡️ఓట్ల లెక్కింపు: మార్చి 3*