Venukumar Study Guide
January 30, 2025 at 12:26 AM
*🔊ఫిబ్రవరి మొదటి వారంలోనే క్యాబినెట్ భేటీ*
*🍥సీఎం రేవంత్‌రెడ్డి... పంచాయతీ ఎన్నికలపైనా ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. తాము సన్నద్ధంగా ఉన్నామంటూ పంచాయతీరాజ్, ఎన్నికల సంఘం అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్‌ల నివేదికలు సిద్ధమయ్యాక ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో నివేదికల ఆమోదం అనంతరం... వాటిపై చర్చించేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందులో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి... కేంద్ర ప్రభుత్వానికి పంపించే వీలుంది. కేంద్రం స్పందన ఎలా ఉన్నా... రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు వెళ్లాలనే కార్యాచరణతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.*