Venukumar Study Guide
January 30, 2025 at 01:00 AM
*🔊chennai: రంగులు మారే అద్దాలు*
*🔶కనుగొన్న సీయూటీఎన్*
*🍥చెన్నై (వడపళని), న్యూస్‌టుడే: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (సీయూటీఎన్) రంగులు మారే సరికొత్త అద్దాలు కనుగొంది. ఇందుకు మెటీరియల్ సైన్స్ విభాగ సహ ఆచార్యులు డాక్టర్ శ్రీనివాసన్ సంపత్, పరిశోధక విద్యార్థిని పి.వి.నవ్య కృషి చేశారని వర్సిటీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్ రంగాల్లో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అద్దాలు బాగా పని చేస్తాయి. ఈ అద్దాలకు విద్యుత్తు అనుసంధానిస్తే నీలం, ఊదా, పసుపు, నారింజ, పచ్చ తదితర రంగుల్లోకి మారుతాయి. కావాల్సిన రంగులోకి మార్చుకోవచ్చు. అతినీలలోహిత, పరారుణ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. కాస్త ఖర్చుతో కూడుకున్నవే అయినా ఆ మేర ప్రయోజనం ఉంటుంది. ఈ అద్దాలపై నేరుగా లైట్‌పడినా ముందున్న వస్తువు చూడొచ్చు. అందుకే రాత్రివేళ వాహనాలు నడిపేటప్పుడూ వాడొచ్చు’’ అని పేర్కొంది. పరిశోధకులు రాసిన వ్యాసం ‘అడ్వాన్స్‌డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ జర్నల్’లో ప్రచురితమైంది.*
👍
1