
Venukumar Study Guide
January 31, 2025 at 05:13 AM
*🔊నేతన్నల కోసం ‘కార్మికుడే యజమాని’ పథకం*
*🔶రూ.386.88 కోట్లతో త్వరలో అమలు*
*🍥ఈనాడు,హైదరాబాద్: నేత కార్మికులు స్వయంసమృద్ధిని సాధిస్తూ యజమానులు (వర్కర్ టు ఓనర్)గా మారేందుకు రూ.386.88 కోట్లతో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలివిడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,104 మందికి దీని ద్వారా లబ్ధి కలగనుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి లేదా ఉగాది నాడు దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. నేత కార్మికుల్లో అధిక శాతం ఆసాముల వద్దే పనిచేస్తున్నారు. పనికి తగిన వేతనం రావడం లేదు. వారికి మరమగ్గాలు అందించి, స్వయంగా వస్త్రాలను తయారు చేసి విక్రయించే అవకాశం కల్పించడం.. ‘కార్మికులే యజమానులు’గా మారడం అనేది ఈ పథకం ఉద్దేశం. సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామంలో 83 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. టీజీఐఐసీ ద్వారా 42 వీవింగ్ షెడ్లు, నాలుగు వార్పింగ్ షెడ్ల నిర్మాణం జరిగింది. వీటిలో 1,104 మంది కార్మికులకు స్థలాలు ఇచ్చి 4,416 మరమగ్గాలను ఏర్పాటు చేయిస్తారు.ఒక్కో లబ్ధిదారుకు రూ.16.52 లక్షల మేర సాయం అందుతుంది. ఇందులో రూ.8.26 లక్షలు (50 శాతం) ప్రభుత్వ సబ్సిడీ కాగా రూ.1,65,220 (10 శాతం) లబ్ధిదారు వాటాగా చెల్లించాలి. మిగతా 40 శాతం బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తారు. త్వరలో బ్యాంకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించి రుణసాయానికి ఆమోదం తీసుకున్న తర్వాత పథకం అమలవుతుంది*
👍
1