
Vizag City Police
February 10, 2025 at 04:15 PM
*విశాఖ నగర ఆర్మడ్ రిజర్వ్ కార్యాలయం నందు ద్వి చక్ర వాహనాల పార్కింగ్ ఏరినా ప్రారంభించిన సీపీ గారు.*
*విశాఖ నగర ఆర్మడ్ రిజర్వ్ కార్యాలయం నందు ఎన్నో ఏళ్లుగా సరైన టూ వీలర్ పార్కింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారని డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ గారు దృష్టికి రావడంతో, వెంటనే సీపీ గారు స్పందించి, పార్కింగ్ ఏరినా ను ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీచేశారు. నిర్మాణం పూర్తి అవ్వడంతో ఈ రోజు సీపీ గారు టూ వీలర్ పార్కింగ్ ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నగర డి.సి.పి (అడ్మిన్)గారు , డి.సి.పి (క్రైమ్స్) గారు మరియు ఇతర ఉన్నాధికారులు పాల్గొన్నారు.*