Vizag City Police
February 11, 2025 at 12:50 PM
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన విశాఖ నగర పోలీసులు.
డీసీపీ -2 (ఎల్& ఓ) శ్రీమతి డి. మేరీ ప్రశాంతి, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో గల వుడా కాలనీ లో ఒక ఇంటిలో అక్రమంగా గంజాయి నిల్వచేసి, రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు గాజువాక పోలీసు వారు సముక్తంగా తనిఖీలు నిర్వహించగా, 94 పాకెట్స్ లలో 184 కేజీల గంజాయిని గుర్తించి, ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 184 కేజీల గంజాయి మరియు ఒక కారు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ గారు గాజువాక మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందించారు.
👍
1