APTEACHERS
February 4, 2025 at 02:57 AM
*♻️𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐍𝐞𝐰𝐬 - నేటి వార్తలు*
*✳️నేటి ప్రాముఖ్యత*
▪️అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం
▪️అంతర్జాతీయ మానవ సౌబ్రాతృత్వ దినోత్సవం
*✳️అంతర్జాతీయ వార్తలు*
▪️త్వరలో భారత్-బ్రిటన్ ఎఫ్‌టీఏ చర్చలు పునఃప్రారంభం
▪️మెక్సికోపై నెలపాటు సుంకాల విధింపు నిలిపివేత-ట్రంప్
▪️రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు సైనిక, ఆయుధ కొరత'
▪️దక్షిణాఫ్రికాకు తమ దేశం ఇచ్చే నిధులన్నింటినీ ఆపేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
▪️కాబుల్ లోని ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలో కాల్పులు, ఒకరు మృతి మరొకరికి గాయాలు
▪️కాంగో -రువాండా దేశాల మద్దతుదారుల మధ్య జరిగిన తిరుగుబాటులో 900 మంది పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది
▪️సిరియాలో బాంబు పేలుడు 18 మంది మహిళలు మృతి
▪️మతసామరస్యానికి బoగ్లాదేశ్ నెలవు అని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూసుఫ్ తెలిపారు
▪️ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు కారణంగా భారీగా ప్రాణనష్టం ఆస్తి నష్టం సంభవించింది
*✳️జాతీయ వార్తలు*
▪️నేడు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ
▪️ఢిల్లీలో ముగిసిన ఎన్నికల ప్రచారం రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్న 1.56కోట్ల మంది.
▪️కుంభమేళాకు పోటెత్తిన భక్తులు ప్రశాంతంగా సాగిన వసంత పంచమి పర్వదినం
▪️మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
▪️వారానికి 70-90 పని గంటలు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
▪️మణిపూర్ హింసాత్మక ఘటనలు ప్రేరేపించడంలో ముఖ్యమంత్రి హస్తం ఉందని తెలిపే ఆడియో క్లిప్పులను ఫారెన్సీక్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు
*✳️రాష్ట్ర వార్తలు*
▪️తిరుమల, అరసవల్లిలో వైభవంగా రథసప్తమి ఉత్సవాలు
▪️ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది.
▪️ఈనెల 10వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి
▪️ఈనెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి
▪️ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి ప్రారంభంలో రెండు నెలలపాటు బ్రిడ్జి కోర్సులు అందివ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
▪️రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ 4 అంబులెన్సులు ఇచ్చారు.ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సిద్ధమేనని ఆయన అన్నారు.
▪️టీచర్ల బదిలీల చట్టంపై కసాత్తు త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
▪️విద్యార్థులం ఫీజు రీయంబర్స్మెంట్ కు మరో 216 కోట్లు రెండు మూడు రోజులు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు
*✳️క్రీడా వార్తలు.*
అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది.
👍
2